ఎన్టీఆర్ కొత్త సినిమాకి బంగ్లాదేశ్ కి సంబంధం ఉందా!
on Oct 1, 2024
యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)తన నయా మూవీ దేవరతో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ ని సృష్టిస్తున్నాడు.సెప్టెంబర్ 27 న విడుదలైన దేవర ఇప్పటికే మూడు వందల కోట్ల ఫిగర్ ని కూడా దాటింది.దీంతో లాంగ్ రన్ లో ఎంత మేర వసూలు చేస్తుందనే ఆసక్తి అభిమానులతో పాటు సినీట్రేడ్ వర్గాల్లో ఉంది.
ఇక దేవర(devara)తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీని ప్రశాంత్ నీల్(prashanth neel)దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. కొన్నిరోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యిన ఈ మూవీ మీద పాన్ ఇండియా లెవల్లో అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన కొన్నివిషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బంగ్లాదేశ్‌లో కథ తెరకెక్కబోతుందని, అక్కడ ఉండే తెలుగు వారికి అండగా ఉండే క్యారక్టర్ లో ఎన్టీఆర్ నిలవబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే మూవీలోని ఎన్టీఆర్ పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతుందని,అలాంటి క్యారక్టర్ ని ఇంతవరకు ఎన్టీఆర్ పోషించలేదని అంటున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజక్ట్ కి సంబంధించిన మిగతా నటినటులు, టెక్నీషియన్స్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.ఎన్టీఆర్ కెరీర్ లో వస్తున్న ముప్పై ఒకటవ సినిమా ఇది.
Also Read