కీర్తి హీరోయిన్.. ఫహద్ స్పెషల్ రోల్.. రెహమాన్ మ్యూజిక్..!
on Jan 4, 2022

తెలుగు, తమిళ్, మలయాళం.. ఇలా విభిన్న దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తూ నటిగా ముందుకు సాగుతోంది కేరళకుట్టి కీర్తి సురేశ్. ప్రస్తుతం తెలుగులో `సర్కారు వారి పాట`, `భోళా శంకర్`, తమిళంలో `సాని కాయిదం`, మలయాళంలో `వాషి` చేస్తున్న కీర్తి.. మరోవైపు తన ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ `గుడ్ లక్ సఖి` విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా కీర్తి ఓ కోలీవుడ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. కథానాయకుడు, రాజకీయ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ తమిళ చిత్రం తెరకెక్కనుంది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనున్న ఈ సినిమాలో నాయికగా నటించేందుకు కీర్తి ఓకే చెప్పిందట. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతోనే ఈ సినిమాకి ఆమె అంగీకారం తెలిపిందని తమిళ చిత్ర వర్గాల సమాచారం.
Also Read:సాయితేజ్ తో సంపత్ నంది సినిమా!
కాగా, ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనుండగా.. స్వర మాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించబోతున్నారని బజ్. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. మరి.. ఈ సినిమాతో కీర్తికి నటిగా ఎలాంటి గుర్తింపు దక్కుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



