అప్పుడు నాని.. ఇప్పుడు రవితేజ..
on Jan 4, 2022

ఒకవైపు కథానాయకుడి పాత్రల్లో అలరిస్తూనే.. మరోవైపు అప్పుడప్పుడు అతిథి పాత్రల్లో మెరుస్తూ ముందుకు సాగుతున్నాడు యువ కథానాయకుడు రాజ్ తరుణ్. ఇప్పటికే `మజ్ను`, `నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్`, `బెలూన్` (తమిళ్) చిత్రాల్లో ఇలా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన రాజ్.. త్వరలో మరో సినిమాలో అతిథిగా కనిపించబోతున్నాడట. అది కూడా ఓ స్టార్ హీరో మూవీలో.
ఆ వివరాల్లోకి వెళితే.. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా `నేను లోకల్` ఫేమ్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో `ధమాకా` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. `పెళ్ళి సందD` ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే.. ఇందులో ఓ గెస్ట్ రోల్ ఉందట. అందులో.. రాజ్ తరుణ్ కనిపిస్తాడని టాక్. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో రాజ్ తరుణ్ తో త్రినాథరావు నక్కిన `సినిమా చూపిస్త మావ` వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ అనుబంధంతోనే `ధమాకా`లో రాజ్, త్రినాథ్ మరోసారి జట్టుకడుతున్నారని సమాచారం.
కాగా, తనకి విజయాన్ని అందించిన దర్శకుల్లో ఒకరైన `ఉయ్యాలా జంపాలా` ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలోనూ రాజ్ తరుణ్ అతిథిగా యాక్ట్ చేశాడు. `మజ్ను` పేరుతో రూపొందిన ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించాడు. మరి.. నానికి అతిథిగా సక్సెస్ చూసిన రాజ్ తరుణ్.. రవితేజ కాంబినేషన్ లోనూ విజయం అందుకుంటాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



