ఘోరంగా మోసపోయిన అలీ.. వైసీపీకి రాజీనామా వెనుక ఇంత కథ ఉందా..!
on Jul 4, 2024
ప్రముఖ నటుడు అలీ (Ali) కొద్దిరోజుల క్రితం రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అలీ కొన్నేళ్లుగా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీకి మద్దతుగా నిలిచారు. అలాంటి అలీ ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత.. పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పారు. దీంతో, వైసీపీ అధికారం కోల్పోవడంతోనే.. అలీ రాజకీయాలకు దూరంగా జరిగారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రముఖ నటుడు శివాజీ (Sivaji) అభిప్రాయం మాత్రం మరోలా ఉంది.
తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అలీ నాకు సోదరుడు లాంటివాడు. పాతికేళ్లుగా తెలుసు. చాలా మంచి వాడు. ఏ పార్టీలో ఉన్నా కూడా ఎప్పుడూ హద్దుమీరి ఇతరుల మీద విమర్శలు చేయలేదు. అయితే గత ప్రభుత్వం చేతిలో అలీ మోసపోయారు. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ దగ్గర బ్రహ్మాండమైన ల్యాండ్ ఉంటే.. ప్రభుత్వం అడగ్గానే ఇచ్చేశారు. నేను మోసపోయానని అలీ అనలేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. వాళ్ళని నమ్మి మోసపోయాడు." అని శివాజీ అన్నారు.
Also Read