వైభవంగా వీరసింహ రెడ్డి చెల్లెలి పెళ్లి.. బాలకృష్ణ, రోజా హాజరు
on Jul 4, 2024
నందమూరి బాలకృష్ణ ఒక్కసారి ఎవరినైనా అభిమానించాలేగాని వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఆ విషయం చాలా సార్లు నిరూపితమైంది. ఇప్పుడు లేటెస్ట్ గా మరో సారి రుజువయ్యింది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
ప్రముఖ సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం రీసెంట్ గా చాలా ఘనంగా జరిగింది. తన స్నేహితుడు, ప్రేమికుడు అయినటువంటి నికొలాయ్ సచ్ దేవ్ తో ముంబై లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ కాస్త వరలక్ష్మి నికొలాయ్ గా మారింది. ఇప్పుడు ఈ వివాహానికి నందమూరి బాలకృష్ణ హాజరయ్యాడు.కలకలం కలిసి ఉండాలని ఆ ఇద్దర్ని ఆశీర్వదించాడు. దీంతో వరలక్ష్మి, నికొలాయ్ ల ఆనందానికి అవధులులేకుండా పోయాయి. ఇప్పుడు వాటి తాలూకు పిక్స్ వైరల్ గా నిలిచాయి. అదే విధంగాఎంత బిజీగా ఉన్నా కూడా తన చెల్లెలి పెళ్ళికి బాలయ్య హాజరవడం పట్ల అభిమానులతో పాటు పలువురు బాలయ్య మంచి తనాన్ని అభినందిస్తున్నారు.
వాళ్లంతా వరలక్ష్మిని బాలయ్య చెల్లెలు అని ఎందుకు అంటున్నారంటే బాలయ్య, వరలక్ష్మి అన్నా చెల్లెళ్ళ గా వీర సింహారెడ్డి లో నటించారు.మూవీలో ఆ ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ అదిరిపోతుంది. గత సంక్రాంతికి వచ్చిన ఆ మూవీ మంచి విజయాన్ని సాధించింది దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన పలువురు నటులు, నటీమణులు ఈ వివాహ వేడుకకి హాజరయ్యారు. మాజీ హీరోయిన్ మాజీ ఎమ్మెల్యే రోజా కూడా హాజరయ్యింది.
Also Read