తన సొంత ఊరిలో గ్రంధాలయాన్ని కట్టించిన చంద్రబోస్
on Jul 4, 2024
మూడున్నర దశాబ్డల నుంచి తన పాటల పూదోటలో అశేష సినీ ప్రేక్షకులని అలరిస్తు వస్తున్న గేయ రచయిత చంద్ర బోస్(chandra bose)నవ రసాల్లోను పాటలు రాయగల అక్షర అమృతుడు . అసలు ఆయన పాట లేనిదే తెలుగు తెర మారాం చేస్తుంది.అంతటి ఖ్యాతి తెచ్చుకున్న ఆయన తన పుట్టిన ఊరుని మర్చిపోకుండా ఒక మంచి పని చేసాడు
చంద్ర బోస్ స్వస్థలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ.. ఇప్పుడు ఆ గ్రామంలో చంద్రబోస్ ఒక గ్రంధాలయాన్ని నిర్మించాడు. దానికి ఆస్కార్ గ్రంధాలయం అనే పేరుని పెట్టాడు..ఆస్కార్(oscar)అనే పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది. తాను ఆర్ఆర్ఆర్ లో రాసిన నాటు నాటు పాటకి ఆస్కార్ రావడంతో ఆ అవార్డుకు తీపిగుర్తుగా ఆ పేరుని పెట్టాడు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, చంద్రబోస్ ల చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభం కానుంది.
ముప్పై ఆరు లక్షల రూపాయిల వ్యయంతో రెండు అంతస్తుల్లో నిర్మించిన నిర్మించిన ఆ గ్రంధాలయం అన్ని వసతులతో ఒకే సారి చాలా మంది చదువుకోవడానికి వీలుగా ఉంది. తన లాగే ప్రతి ఒక్కరు అక్షర సాహితీ పరిమళాల్ని ఆవలింపు చేసుకోవాలని చంద్ర బోస్ ఆ ఆస్కార్ గ్రంధాలయాన్ని నిర్మించాడు.
Also Read