సైనా నెహ్వాల్ కు బహిరంగ క్షమాపణ చెప్పిన సిద్ధార్థ్!
on Jan 12, 2022

సోషల్ మీడియా వేదికగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో చోటుచేకున్న భద్రతాలోపాన్ని ప్రస్తావిస్తూ సైనా ట్వీట్ చేయగా.. దానిని రీట్వీట్ చేస్తూ సిద్ధార్థ్ దారుణ వ్యాఖ్యలు చేశాడు. దీంతో మహిళా కమిషన్ పాటు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సిద్ధార్థ్ తీరుపై మండిపడ్డారు. అన్ని వర్గాల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతుండటంతో సైనాకి సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పాడు.
సైనాకు బహిరంగ క్షమాపణలు చెబుతూ ఓ లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు సిద్ధార్థ్. తానో అసభ్యకరమైన జోక్ చేశానని, అందుకు క్షమించాలని కోరాడు. తాను వాడిన భాష సరికాదని, అయితే అది తాను దురుద్దేశంతో చేసిన ట్వీట్ కాదని అన్నాడు. మహిళలంటే తనకు ఎనలేని గౌరవమని, మహిళలను కించపరుస్తూ కామెంట్స్ చేయాలనే ఉద్దేశంతో మాత్రం అలా చేయలేదని సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు. మీరెప్పుడూ నా చాంపియనేనని, నా క్షమాపణలు అంగీకరిస్తారని ఆశిస్తున్నానంటూ సిద్ధార్థ్ లేఖలో పేర్కొన్నాడు.

సిద్ధార్థ్ క్షమాపణలతో ఈ వివాదం ఇంతటితో ముగిసిపోతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



