ముద్దుతో గిన్నిస్ రికార్డ్‌లోకి
on May 31, 2014
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తొందరగా రావాలన్నా, ప్రపంచంలో అందరికన్నా వినూత్నంగా కనిపించాలన్నా గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అలా వినూత్న రికార్డు కోసం ప్రయత్నిస్తున్నారు ఇసాక్. ఒకే పాటలో అత్యధిక ముద్దులు గల సీన్‌లు చిత్రీకరించి ఈ రికార్డ్ సాధించాలనేది దర్శకు కుడు జేఎం ఇసాక్ ప్రయత్నం. ఆయనకు ఇదివరకే ఒక గిన్నిస్ రికార్డ్ కలిగి వున్నారు. ఆయన మొదటి సినిమా ‘అగడం’. ఈచిత్రన్ని ఎడిటింగ్ లేకుండా తెరకెక్కించి ఆయన గిన్నిస్ రికార్డుకి ఎక్కారు ఇసాక్. ఆయన రెండో చిత్రం ‘లారా’, ద్వారా కూడా మరో రికార్డును సొంతం చేసుకునేందుకు ఇలా వెరైటీగా ప్రయత్నిస్తున్నారు. లాస్ట్ బెంచ్ బాయ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రంలో నూతన నటీనటులు హరి, శ్రీప్రియాంక, గీతాంజలి, లక్ష్మీ కిరణ్, గణేష్, చంద్రు తదితరులు నటిస్తున్నారు. ఏకాంతం కోసం వెళ్లిన ఒక సినీ దర్శకుడికి ఎదురయ్యే సంఘటనలు, దిగ్భ్రాంతి కలిగించే విషయాలతో సాగే, ఒక హర్రర్ థ్రిల్లర్ గా చిత్రకథ ఉండబోతోందని దర్శకుడు ఇసాక్ తెలిపారు. ఏమైనా దర్శకుడి గిన్నిస్ రికార్డు ఆశ నెరవేరాలంటే చిత్రంలో ముద్దు సీన్లకు సెన్సార్ బోర్డు వాళ్లు అడ్డు పడకుండా ఉండాలి. ఏమైనా ఇదో కొత్త తరహా...