ఈ వారం ఏడు సినిమాలొస్తున్నాయ్!
on Jan 25, 2022

భారీ-క్రేజీ సినిమాల విడుదలలు వాయిదా పడటంతో ఓ మోస్తరు బడ్జెట్ నుంచి తక్కువ బడ్జెట్‌తో తయారైన పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పరుగులు పెడుతున్నాయి. ఈ వారం కూడా అందుకు మినహాయింపు కాదు. కొన్ని తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా ఈ వారం మన ముందుకు వస్తున్నాయి.
విశాల్ డబ్బింగ్ సినిమా 'సామాన్యుడు' రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలవుతోంది. డింపుల్ హయతి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు శరవణన్ దర్శకుడు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే ఇంప్రెసివ్‌గా అనిపించింది. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన 'కిన్నెరసాని' సినిమా కూడా జనవరి 26నే వస్తోంది. రమణతేజ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి మహతి స్వరసాగర్ సంగీతం సమకూర్చాడు. సంక్రాంతికి వచ్చిన అతడి సినిమా 'సూపర్ మచ్చి' డిజాస్టర్ అయ్యింది. కాగా జనవరి 26న 'గోర్‌మాటి' అనే బంజారా ఫిల్మ్ కూడా వస్తోంది. శంకర్ జాదవ్, కరిష్మా కుమార్, అదిరే అభి, సిరిరాజ్, విద్యావత్ రేఖానాయక్ ఈ మూవీలో నటించారు.
Also read: రూ. 150 కోట్లు ఖర్చుపెట్టి 'బాహుబలి'ని చెత్తబుట్టలో పడేశారు!
ఈమధ్య కాలంలో హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎక్కువగా చేసుకుంటూ వచ్చిన కీర్తి సురేశ్ చేసిన మరో విమన్ సెంట్రిక్ ఫిల్మ్ 'గుడ్ లక్ సఖి' జనవరి 28న విడుదలవుతోంది. నగేశ్ కుకునూర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు చేశారు. డీఎస్పీ మ్యూజిక్ దీనికి స్పెషల్ అట్రాక్షన్. మలయాళం స్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ 18' డబ్బింగ్ వెర్షన్ 'గుడ్ లక్ సఖి'తో పోటీపడేందుకు అదే రోజు రెడీ అవుతోంది. శంకర్ రామకృష్ణన్ డైరెక్టర్ చేసిన ఈ మూవీలో ఆర్య, పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలు చేశారు.
Also read: ప్రభాస్ 'ఆదిపురుష్' డైరెక్టర్ ఓం రౌత్ గురించి మీకెంత తెలుసు?
నిర్మాత నట్టి కుమార్ కుమార్తె కరుణ హీరోయిన్‌గా నటించిన 'దయ్యంతో సహజీవనం' అనే సినిమాతో పాటు 'క్షుద్ర మంత్రగత్తెలు' అనే సినిమా కూడా జనవరి 29న విడుదలవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



