Home

»

Latest News

రూ. 150 కోట్లు ఖ‌ర్చుపెట్టి 'బాహుబ‌లి'ని చెత్త‌బుట్ట‌లో ప‌డేశారు!

Jan 25, 2022

 

య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి 'బాహుబ‌లి 2' మూవీ రిలీజై రికార్డు క‌లెక్ష‌న్ల‌ను సాధించిన త‌ర్వాత, ఆయ‌న‌తో క‌లిసి ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ 'బాహుబ‌లి: బిఫోర్ ద బిగినింగ్' పేరుతో ప్రిక్వెల్ సిరీస్‌ను తీస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది. 'బాహుబ‌లి'లో ర‌మ్య‌కృష్ణ పోషించిన శివ‌గామి క‌థ‌తో ఈ సిరీస్‌ను తీస్తామ‌ని తెలిపింది. ఆ త‌ర్వాత ఆ సిరీస్ షూటింగ్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. శివ‌గామిగా బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్ న‌టిస్తుండ‌గా, తెలుగు ద‌ర్శ‌కుడు దేవా క‌ట్టా డైరెక్ష‌న్‌లో సుమారు 6 నెల‌ల పాటు షూటింగ్ జ‌రిగింది. రాహుల్ బోస్‌, అతుల్ కుల‌క‌ర్ణి కూడా ఆ సిరీస్‌లో కీల‌క పాత్ర‌ధారులు. ఆ ప్రాజెక్టుపై నెట్‌ఫ్లిక్స్ రూ. 100 కోట్లు ఖ‌ర్చుపెట్టింది.

షూటింగ్ త‌ర్వాత ఏడాది పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రిపాక వ‌చ్చిన ఔట్‌పుట్ చూసుకొని నిరాశ‌చెందిన నెట్‌ఫ్లిక్స్.. దాన్ని ప‌క్క‌న‌పెట్టేసి కొత్త తారాగ‌ణం, ద‌ర్శ‌కునితో మ‌ళ్లీ సిరీస్‌ను తియ్యాల‌ని ప్లాన్ చేసింది. ఆ త‌ర్వాత ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌ను ఆ ప్రాజెక్టు కోసం ఎంచుకుంది. వారిలో ఒక‌రు 'జ‌న్న‌త్' ఫేమ్ కునాల్ దేశ్‌ముఖ్ కాగా, మ‌రొక‌రు 'తీన్' ఫేమ్ రిభు దాస్‌గుప్తా. 2021 జూలైలో ప్రిప‌రేష‌న్ వ‌ర్క్ మొద‌లైంది. శివ‌గామి క్యారెక్ట‌ర్ కోసం మృణాల్ ఠాకూర్ స్థానంలో హిందీ, పంజాబీ చిత్రాల న‌టి వామికా గ‌బ్బిని తీసుకున్నారు. తెలుగులో ఆమె 'భ‌లే మంచి రోజు'లో సుధీర్‌బాబు స‌ర‌స‌న నాయిక‌గా న‌టించింది.

Also read: 'రౌడీ బాయ్స్‌' కోసం రూ. 20 ల‌క్ష‌లు పెంచిన అనుప‌మ‌!

ప్రి-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ త‌ర్వాత స‌డ‌న్‌గా మొత్తం ప్రాజెక్టునే ఆపేయాల‌ని నెట్‌ఫ్లిక్స్ నిర్ణ‌యించుకోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. అప్ప‌టివ‌ర‌కూ మొత్తం ఆ ప్రాజెక్టుపై రూ. 150 కోట్ల దాకా అది ఖ‌ర్చుపెట్టింది. అనుకున్న స్థాయిలో ఆ సిరీస్ రావ‌ట్లేద‌ని భావించిన ఆ సంస్థ‌, ప‌లు చ‌ర్చ‌ల త‌ర్వాత ఆ ప్రాజెక్టును ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ షూటింగ్ మొద‌లైన‌ట్ల‌యితే మ‌రో రూ. 200 కోట్ల వ‌ర‌కు దానిపై పెట్టాల్సి వ‌స్తుంద‌నీ, క‌ల్ట్ స్టేట‌స్‌ను అందుకున్న 'బాహుబ‌లి' స్థాయిలో సిరీస్ లేక‌పోతే అది కూడా వృథా అవుతుంద‌నే ఉద్దేశంతో టోట‌ల్ ప్రాజెక్టును నెట్‌ప్లిక్స్‌ను చెత్త‌బుట్ట‌లో ప‌డేసింద‌నీ అంటున్నారు.

Also read: ఈ టాప్‌ హీరోయిన్ల ఆస్తులెంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే!

ప్ర‌భాస్‌, అనుష్క‌, రానా ద‌గ్గుబాటి, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన 'బాహుబ‌లి: ద బిగినింగ్' 2015లో విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ కాగా, దాని రెండో భాగం 'బాహుబ‌లి: ద క‌న్‌క్లూజ‌న్' 2017లో వ‌చ్చి, ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యం సాధించడంతో పాటు ఆల్‌టైమ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com