`నేను లోకల్` అంటూ నాని సందడి చేసి నేటికి ఐదేళ్ళు!
on Feb 3, 2022

నేచురల్ స్టార్ నానికి 2017 క్యాలెండర్ ఇయర్ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. ఆ ఏడాది నాని హీరోగా మూడు చిత్రాలు విడుదల కాగా, అవన్నీ కూడా మంచి విజయం సాధించాయి. వాటిలో `నేను లోకల్` ఒకటి. ఇందులో బాబు అనే ఇంజినీరింగ్ చదివే యువకుడి పాత్రలో తన హుషారైన నటనతో ఆకట్టుకున్నాడు నాని. ఇక అతణ్ణి ప్రేమించే యువతి కీర్తి పాత్రలో కేరళకుట్టి కీర్తి సురేశ్ నటించగా నవీన్ చంద్ర, సచిన్ ఖేద్కర్, రావు రమేశ్, తులసి, పోసాని కృష్ణమురళి, ఈశ్వరీ రావు, రఘు బాబు, వెన్నెల కిశోర్, ప్రభాస్ శ్రీను, కృష్ణ భగవాన్, అనీష్ కురువిల్లా, రజిత ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. త్రినాథరావ్ నక్కిన డైరెక్ట్ చేసిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై `దిల్` రాజు, శిరీష్ నిర్మించారు.
Also Read: `పుష్ప - ద రైజ్` బాటలోనే `పుష్ప - ద రూల్`!
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలకు చంద్రబోస్, శ్రీమణి సాహిత్యమందించారు. పాటల్లో ``అరరె ఎక్కడఎక్కడ`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``నెక్స్ట్ ఏంటి?``, ``డిస్టర్బ్ చేస్తా నిన్ను``, ``సైడ్ ప్లీజ్``, ``చంపేసావే నన్ను`` అంటూ సాగే గీతాలు కూడా రంజింపజేశాయి. బెంగాలీలో `టోటల్ దాదాగిరి`, ఒడియాలో `లోకల్ టోకా లవ్ చోకా` పేర్లతో ఈ సినిమా రీమేక్ అయింది. 2017 ఫిబ్రవరి 3న విడుదలై ఘనవిజయం సాధించిన `నేను లోకల్`.. నేటితో ఐదు వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



