ఫిబ్రవరి తొలివారం.. డీఎస్పీ `సింగిల్స్`మయం!
on Feb 3, 2022
.webp)
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ నుంచి ఓ పాట వస్తోందంటే.. సంగీతాభిరుచి ఉన్న తెలుగు యువత దృష్టి అంతా ఆ సింగిల్ పైనే ఉంటుంది. అలాంటి డీఎస్పీ నుంచి ఈ వారం ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు సింగిల్స్ రాబోతున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ స్వరవిన్యాసాలను ఇష్టపడేవారికి ఇది ఆనందాన్నిచ్చే అంశమనే చెప్పాలి. ఈ వారం దేవి శ్రీ బాణీలతో వస్తున్న నాలుగు `సింగిల్స్`లో.. మూడు ఆయా ఆల్బమ్స్ లో ఫస్ట్ సింగిల్స్ కావడం విశేషం.
Also Read: హీరో శ్రీకాంత్ తో హీరోయిన్ ఫైట్.. కారణం ఏంటీ?
ఆ వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 3న అంటే ఈ రోజు `ఉప్పెన` హీరో వైష్ణవ్ తేజ్, `రొమాంటిక్` హీరోయిన్ కేతికా శర్మ జంటగా నటిస్తున్న `రంగ రంగ వైభవంగా` నుంచి ``తెలుసా తెలుసా`` అంటూ సాగే పాట విడుదల కానుంది. శంకర్ మహదేవన్ ఆలపించిన ఈ గీతం.. ఆ ఆల్బమ్ నుంచి వస్తున్న ఫస్ట్ సింగిల్. ఇక రేపు (ఫిబ్రవరి 4) శర్వానంద్, రష్మికా మందన్న జోడీగా నటించిన `ఆడవాళ్ళు మీకు జోహార్లు` నుంచి టైటిల్ సాంగ్ వస్తోంది. ఇది కూడా ఆ మూవీ నుంచి రాబోతున్న ఫస్ట్ సింగిల్ నే.
Also Read: కబడ్డీ ప్లేయర్ `పెద్ది`గా ఎన్టీఆర్!?
అదే విధంగా ఫిబ్రవరి 5న మాస్ మహారాజా రవితేజ `ఖిలాడి` నుంచి ఐదో సింగిల్ ``క్యాచ్ మీ`` రిలీజ్ కానుంది. చిత్ర కథానాయిక డింపుల్ హయాతిపై చిత్రీకరించిన డాన్స్ నంబర్ ఇది. ఇక ఫిబ్రవరి 7న విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబో మూవీ `ఎఫ్ 3` నుంచి ``లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు`` అంటూ సాగే ఫస్ట్ సింగిల్ రాబోతోంది. మొత్తంగా.. ఫిబ్రవరి తొలివారం డీఎస్పీ `సింగిల్స్` మయం అవుతోందన్నమాట. మరి.. వీటిలో ఏయే గీతాలు చార్ట్ బస్టర్స్ గా నిలుస్తాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



