ఉప్పెన` బాటలో `18 పేజెస్`!
on Dec 28, 2021

సుకుమార్ మంచి దర్శకుడు మాత్రమే కాదు అభిరుచి ఉన్న నిర్మాత కూడా. `సుకుమార్ రైటింగ్స్` అంటూ ఓ ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి వేరే బ్యానర్స్ కాంబినేషన్ లో తనే రచనా సహకారమందిస్తూ కొన్ని సినిమాలు నిర్మించాడు సుక్కు. `కుమారి 21 ఎఫ్`, `దర్శకుడు`, `ఉప్పెన` ఈ తరహాలో రూపొందినవే. ఇప్పుడు ఈ జాబితాలోనే మరో సినిమా సిద్ధమవుతోంది. ఆ చిత్రమే.. `18 పేజెస్`. `కుమారి 21 ఎఫ్` తరువాత పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. `మెలోడీ స్పెషలిస్ట్` గోపీసుందర్ బాణీలు అందిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న తెరపైకి రాబోతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. సుకుమార్ రచనా నిర్మాణంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన `ఉప్పెన` కూడా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే రిలీజైంది. ప్రేమికుల దినోత్సవ కానుకగా ఫిబ్రవరి 12న `ఉప్పెన` విడుదల కాగా.. ఇప్పుడదే ఫిబ్రవరి మాసంలో సుకుమార్ నిర్మాణంలోని తదుపరి చిత్రం `18 పేజెస్` కూడా రాబోతుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి.. `ఉప్పెన` బాటలోనే వెళుతున్న `18 పేజెస్` కూడా బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



