సాయిపల్లవి ఈ సారైనా హ్యాట్రిక్ కొడుతుందా!
on Dec 28, 2021

సహజ అందంతో తెలుగు కుర్రకారుని `ఫిదా` చేసిన టాలెంటెడ్ బ్యూటీ సాయిపల్లవి. పేరుకి తమిళ అమ్మాయి అయినా.. మలయాళం, తెలుగు భాషల్లో అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ అనిపించుకుంది పల్లవి. మరీముఖ్యంగా.. టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్స్ లో భాగమైంది. నాలుగేళ్ళ క్రితం `ఫిదా`, `మిడిల్ క్లాస్ అబ్బాయ్` (ఎంసీఏ) చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ చూసిన సాయిపల్లవి.. ఈ ఏడాది `లవ్ స్టోరి`, `శ్యామ్ సింగ రాయ్`తో ఆ ఫీట్ ని మరోసారి రిపీట్ చేసింది.
ఇదిలా ఉంటే.. త్వరలో ఈ నేచురల్ యాక్ట్రస్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో పలకరించబోతోంది. ఆ సినిమానే.. `విరాట పర్వం`. రానా దగ్గుబాటికి జంటగా పల్లవి నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో తెరపైకి రాబోతోంది. ఇందులోనూ అభినయానికి ఆస్కారమున్న పాత్రలో దర్శనమివ్వనుంది సాయిపల్లవి. నక్సలిజం నేపథ్యంలో 1990ల కాలం నాటి కథాంశంతో `నీదీ నాదీ ఒకే కథ` ఫేమ్ వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
మరి.. `ఫిదా`, `ఎంసీఏ` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత `కణం`, `పడి పడి లేచె మనసు` వంటి ఫ్లాప్స్ కారణంగా హ్యాట్రిక్ మిస్ అయిన సాయిపల్లవి.. `లవ్ స్టోరి`, `శ్యామ్ సింగ రాయ్` వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ అనంతరం వస్తున్న `విరాట పర్వం`తోనైనా తెలుగునాట తొలి హ్యాట్రిక్ అందుకుంటుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



