Home

»

Latest News

మ‌హేశ్ `బిజినెస్ మేన్`కి ప‌దేళ్ళు!

Jan 13, 2022

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిలిచే సినిమాల్లో `బిజినెస్ మేన్` ఒక‌టి. `పోకిరి` వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లోనూ.. `దూకుడు` వంటి సంచ‌ల‌న చిత్రం అనంత‌రం యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ కాంబినేష‌న్ లోనూ మ‌హేశ్ చేసిన చిత్ర‌మిది. ఇందులో ``సూర్య అంటే పేరు కాదు.. ఇట్స్ ఎ బ్రాండ్`` అంటూ కాస్త నెగ‌టివ్ షేడ్స్ ఉన్న డైన‌మిక్ హీరో రోల్ లో నెవ‌ర్ సీన్ బిఫోర్ పెర్ఫార్మెన్స్ తో ఎంట‌ర్టైన్ చేశారు మ‌హేశ్. మ‌హేశ్ బాబుకి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ తొలిసారిగా న‌టించిన ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్, నాజ‌ర్, సాయాజీ షిండే, సుబ్బ‌రాజు, బ్ర‌హ్మాజీ, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం, సంజ‌య్ స్వ‌రూప్, బండ్ల గ‌ణేశ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో అల‌రించారు. పూరీ జ‌గ‌న్నాథ్ అతిథి పాత్ర‌లో మెరిసిన ఈ చిత్రంలో శ్వేతా భ‌ర‌ద్వాజ్ ఓ ప్ర‌త్యేక గీతంలో చిందేసింది.

Also Read: బ‌న్నీ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `దేశ ముదురు`కి 15 ఏళ్ళు!

``సారొస్తారొస్తారా``, ``చంద‌మామ‌``, ``పిల్లా``, ``బ్యాడ్ బోయ్స్``, ``ఆమ్ చి ముంబై``.. ఇలా ఇందులోని గీతాల‌న్నీ ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. పాట‌ల‌న్నింటికీ భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్ సాహిత్య‌మందించారు. ఆర్. ఆర్. మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్. ఆర్. వెంక‌ట్ నిర్మించిన ఈ చిత్రం.. బెంగాలీలో `బాస్` (2013) పేరుతో రీమేక్ అయింది. సంక్రాంతి కానుక‌గా 2012 జ‌న‌వ‌రి 13న విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన `బిజినెస్ మేన్`.. నేటితో 10 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com