అహ్మదాబాద్‌లో మహేశ్ వెంటబడ్డ అమ్మాయి
on Dec 2, 2016
సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు..మరీ ముఖ్యంగా అమ్మాయిలైతే పడిచచ్చిపోతారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశంలోని చాలా ప్రాంతాల్లో మహేశ్‌కు అభిమానులున్నారు. తాజాగా మురగదాస్ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్న సినిమా షూటింగ్ అహ్మదాదాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్‌లో పాల్గొనేందుకు తన బస్సులో నుండి దిగి కారు ఎక్కుతున్న సమయంలో అక్కడే ఉన్న ఒక యువతి మహేశ్‌ను చూడాలని సెక్యూరిటీని సైతం తప్పించుకుని ప్రిన్స్‌ను కలుసుకుంది. ఆ వెంటనే ఇతర అభిమానులు కూడా సూపర్‌స్టార్ కారును చుట్టుముట్టేశారు. ఈ సంఘటనతో మహేశ్‌తో పాటు చిత్రయూనిట్ కూడా అవాక్కయ్యింది.