సినిమా పేరు :మత్తు వదలరా
తారాగణం: శ్రీ సింహ, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, ఛత్రపతి అజయ్, రోహిణి, రాజా సిరివెన్నెల తదితరులు
సంగీతం: కాల భైరవ
ఫొటోగ్రఫీ: సురేష్ సరంగం
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
రచన, దర్శకత్వం:నితీష్ రానా
బ్యానర్ : క్లాప్ ఎంటర్ టైన్మెంట్
రిలీజ్ : మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు: చిరంజీవి,హేమలత పెదమల్లు
విడుదల తేదీ: సెప్టెంబర్ 13 , 2024
2019 లో వచ్చిన మత్తు వదలరా(mattu vadalara)ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. నేడు ఆ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన మత్తు వదలరా 2(mattu vadalara 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి పార్ట్ 1 లాగానే పార్ట్ 2 కూడా ప్రేక్షకులని నవ్వుల్లో ముంచెత్తిందా లేదా చూద్దాం.
కథ
బాబు మోహన్ (శ్రీ సింహ), ఏసుబాబు(సత్య) హై ఎమర్జెన్సీ టీం లో వర్క్ చేస్తుంటారు. సంఘవిద్రోహుల శక్తుల నుంచి అమాయకులని కాపాడటమే ఆ టీం యొక్క లక్ష్యం. ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఏర్పాటు చేసిన మరో పోలీసు సంస్థ. కాకపోతే బాబు, ఏసుబాబు ఉద్యోగం సక్రమంగా చేస్తూనే క్లయింట్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తుంటారు. వీళ్ళతో పాటే నిధి(ఫరియా అబ్దుల్లా) మైకల్(సునీల్ ) వర్క్ చేస్తుంటారు. ఇంకో పక్క ఆకాష్ (అజయ్) అనే బిజినెస్ మాన్ అమ్మాయిలని డ్రగ్స్ కి బానిసగా చేసి వాళ్ళంతట వాళ్లే అశ్లీల పనులు చేసేలా చేస్తుంటాడు.మత్తు వదిలాక వాళ్ళని తనకి అవసరమైన రీతిలో బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటాడు.ఇంకో పక్క బాబు, ఏసు కలిసి రెండు హత్యలు చేసారని కేసు నమోదు అవుతుంది. వాటి నుంచి ఆ ఇద్దరు ఎలా తప్పించుకున్నారు? అదే విధంగా స్టార్ హీరో యువ (వెన్నెల కిషోర్) కోసం కూడా ఏసు, బాబు లు ఎందుకు వెతుకుతున్నారు? అసలు ఎందుకు డబ్బులు దొంగతనం చేస్తున్నారు? ఆకాష్ కి,యువ లతో ఆ ఇద్దరకీ ఏమైనా సంబంధం ఉందా? అసలు చనిపోయిన వాళ్లెవరు? నిజంగానే ఏసు, బాబు లే చేసారా? లేక ఇంకెవరైనా చేసారా? అనేదే ఈ కథ
ఎనాలసిస్ :
సినిమా ముందు వచ్చే దూమపానం,మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పడం దగ్గరనుంచే, మా మూవీ పక్కా కామెడీ మూవీ అనే విషయాన్నీ మేకర్స్ చెప్పకనే చెప్పారు. మూవీ ఆసాంతం అందుకు తగ్గట్టుగానే సాగింది. ఫస్ట్ ఆఫ్ విషయాన్ని వస్తే మత్తు వదలరా పార్ట్ 1 తర్వాత బాబు, యేసు ఉద్యోగాలు పోవడంతో పలానా పనిలో జాయిన్ అయ్యారని క్లియర్ కట్ గా చెప్పడం సినిమాకి ప్లస్ అయ్యింది.ఇదే సూత్రాన్ని టిల్లు స్క్వేర్ కి కూడా అప్లై చేసి ఘన విజయం సాధించారు. ఇక అక్కడనుంచి వాళ్లు చేసే ఉద్యోగంలో డబ్బు ఎలా సంపాదిస్తున్నారో చెప్పే సీన్స్ చాలా బాగున్నాయి.ప్రతి ఫ్రేమ్ లో దాదాపుగా బాబు ,యేసు బాబు లే ఉన్నా కూడా ఎక్కడా బోర్ కొట్టలేదు.కామెడీ అండ్ సస్పెన్స్ బాగానే వర్క్ అవుట్ అయ్యింది.కాకపోతే మిగతా పాత్రలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు.ఇక అసలు కథలోకి ఎప్పుడు వస్తారు అని ప్రేక్షకుడు అనుకుంటున్న టైంకి బాబు యేసుల మైండ్ బ్లాక్ అయ్యేలా సస్పెన్స్ ని ఇవ్వడం బాగుంది.ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే చేయని హత్యల నుంచి తమని కాపాడుకుంటూ అసలు హంతులని పట్టుకునే ప్రాసెస్ లో కొంచం ఉత్సుహత అనేది లేకుండా పోయింది. అలాగే బాబు, నిది ల మధ్య లవ్ స్టోరీ ని నడిపించాల్సింది. ఆ అవకాశం ఉండీ కూడా ఆ దిశగా చెయ్యలేదు,మరి అలాంటప్పుడు ఫరియా ని కాకుండా ఎవరైనా ఆ క్యారక్టర్ కి సరిపోతుంది కదా అనే ఆలోచన ప్రేక్షకుడికి అనిపిస్తుంది. కాకపోతే ఆ ఎంటైర్ లోపాలన్నిటిని యేసు పాత్రలో సత్య చేసిన కామెడి భారీగానే కవర్ చేసింది
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
శ్రీ సింహ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది.మొదటి భాగంలో చేసిన దాని కంటే బాగా చేసాడు. తెలుగు సినిమాకి ఇంకో మంచి హీరో దొరికినట్టే. ఇక సత్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది, తన కామెడి తో సినిమా రేంజ్ ని పెంచాడు.గత చిత్రాల కంటే ఈ మూవీలో ఇంకాస్తే ఎక్కువగానే చేసాడు.పైగా మూవీ మొత్తానికి సత్య కామెడినే హైలెట్ గా నిలిచిందని కూడా చెప్పవచ్చు. ఇక ఫరియా కూడా తన పాత్ర మేరకు బాగానే చేసినా కూడా గుర్తుండిపోయే పాత్ర మాత్రం కాదు. ఇక అజయ్, వెన్నెల కిషోర్, సునీల్, రోహిణి లు కూడా సీనియర్ నటులనే గుర్తింపుని పొందేలా చాలా చక్కగా చేసారు.ఇక దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లోనే కొట్టొచ్చినట్టు కనపడింది. రచయిత కూడా దర్శకుడే కాబట్టి మాటలు బాగా పేలాయి.ఇలాంటి సినిమాలకి మాటలే ప్రదానం కూడా. ఇక ఫొటోగ్రఫీ అయితే మూవీని ఇంకో రేంజ్ కి తీసుకెళ్లింది. సాంగ్స్ గురించి పెద్దగా చెప్పుకునే అవసరం లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని సంగీత దర్శకుడు కాల భైరవ ఒక రేంజ్ లో ప్రెజంట్ చేసాడు
తెలుగుఒన్ పర్స్పెక్టివ్:
ఫైనల్ గా చెప్పాలంటే సినిమా మొత్తం ఎక్కడా బోర్ అనేది లేకుండా ఎంటర్ టైన్మెంట్ కోణంలో సాగింది. ఆ ఎంటర్ టైన్మెంట్ కోణమే సినిమాని కాపాడింది
- అరుణా చలం