అల్లు అర్జున్ ఎమర్జెన్సీ మీటింగ్..ఏం మాట్లాడబోతున్నాడు
on Dec 21, 2024
పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో పాటుగా ఆమె కుమారుడు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద పెట్టారు.రీసెంట్ గా ఈ విషయానికి సంబంధించిన పలు విషయాలపై అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడుతు అల్లు అర్జున్ పై కొన్ని విమర్శనాస్త్రాలు సంధించాడు.
ఇక ఈ రోజు సాయంత్రం అల్లుఅర్జున్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో మీడియాతో ముచ్చటించబోతున్నాడు.దీంతో అల్లు అర్జున్(allu arjun)ఏం మాట్లాడబోతున్నాడో అనే ఆసక్తి అందరిలో ఉంది.ఇక అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ పై ఏంఐఏం పార్టీకి చెందిన చాంద్రాయణగుట్ట ఏంఎల్ఏ అక్బరుద్దీన్ ఓ వైసి మాట్లాడుతు అల్లు అర్జున్ థియేటర్ లో ఉన్నప్పుడు పక్కనున్నవాళ్ళు తొక్కిసలాట జరిగిందని చెప్పారు.అయితే మన సినిమా హిట్ అని అల్లుఅర్జున్ వాళ్ళతో అన్నాడని చెప్పిన నేపథ్యంలో కూడా అల్లుఅర్జున్ తన మీటింగ్ లో ఈ విషయాలపై మాట్లాతాడేమో అనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.తొక్కిసలాటలో గాయపడిన శ్రీ తేజ్ ఆరోగ్యం కొద్దిగా కుదుటపడినట్టుగా తెలుస్తుంది.
Also Read