సినిమా పేరు :మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం
తారాగణం: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్ష వర్ధన్, ఛత్రపతి అజయ్ తదితరులు
సంగీతం:కళ్యాణ్ నాయక్
ఫొటోగ్రఫీ: బాల్ రెడ్డి
ఎడిటర్: నాగేశ్వరరావు
రచన, దర్శకత్వం: లక్ష్మణ్ కార్య
బ్యానర్ : పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్
సమర్పణ:తబిత సుకుమార్
నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య
విడుదల తేదీ: అగస్ట్ 23 2024
భారీ బడ్జట్, భారీ హీరోల సినిమాలు మాత్రమే సినిమాలు అని భ్రమించే ప్రస్తుత సినీ లోకంలో స్మాల్ మూవీ మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ఈ రోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది .పైగా రావు రమేష్ ప్రధాన పాత్ర కావడం టైటిల్ కూడా ఆయనదే కావడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కూడా నెలకొని ఉంది .మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
మధ్య తరగతి కుటుంబానికి చెందిన సుబ్రహ్మణ్యం(రావు రమేష్) పాతిక సంవత్సరాల క్రితం గవర్నమెంట్ జాబ్ పొందటం కోసం అందుకు తగ్గ పరీక్షలు కూడా రాసి ఇంట్లో ఖాళీగా ఉంటాడు. సిగరెట్లు కోసం కూడా తన భార్య కళారాణి (ఇంద్రజ) మీద ఆధారపడి జేబులో రూపాయి లేకుండా ఓసీ గా బతుకుతుంటాడు. అలాగే సగంలో ఆగిపోయిన ఇంటిని గవర్నమెంట్ జాబ్ రాగానే పూర్తి చెయ్యాలని కలలు కంటు ఉంటాడు. ఇక కళారాణి కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తురాలే. సుబ్రహ్మణ్యం ని ఎప్పుడు తిడుతూ ఉంటుంది. ఇక వీళ్లద్దరికి అర్జున్ (అంకిత్ కొయ్య) అనే కొడుకు ఉంటాడు. అల్లరి చిల్లరగా తిరుగుతు ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన తండ్రి అని అల్లు అర్జున్ తన అన్నయ్యే అని చిన్నప్పుడు మా అమ్మ నాన్న లకి ఇచ్చి వెళ్లారని చెప్తు ఉంటాడు. ఒకరితో బ్రేక్ అప్ అయిన ప్యూర్ అప్ డేట్ యువతీ కాంచన (రమ్య పసుపులేటి) ప్రేమ కోసం పరితపిస్తుంటాడు. ఒక రోజు సుబ్రహ్మణ్యం బ్యాంకు అకౌంట్ లో పది లక్షల రూపాయిలు డబ్బులు పడ్డాయని మెసేజ్ వస్తుంది. ఆ డబ్బులు ఎవరు వేశారు? సుబ్రహ్మణ్యం వాటిని ఖర్చు పెట్టాడా లేక ఉంచాడా? తను అల్లు అర్జున్ తమ్ముడని అర్జున్ ఎందుకు అనుకుంటున్నాడు? కాంచన తో ప్రేమ సక్సెస్ అయ్యిందా?అసలు సుబ్రమణ్యం గవర్నమెంట్ జాబ్ కోసమే పాతికేళ్ల నుంచి ఎందుకు ఖాళీగా ఉన్నాడు? ఒక వేళ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కి సుబ్రమణ్యం సరిపోతాడా? అనేదే పూర్తి కథ
ఎనాలసిస్ :
ముందుగా ఇలాంటి సినిమాని సిల్వర్ స్క్రీన్ కి అందించినందుకు ఎంటైర్ సుబ్రహ్మణ్యం టీం కి హాట్స్ ఆఫ్ చెప్పాలి.
సినిమా అంటే భారీ బడ్జట్,లొకేషన్స్ హడావిడి కాదు, ఉత్కంఠతో కూడుకున్న కథ, అందుకు తగ్గట్టుగా క్యారెక్టర్స్ ల పెర్ ఫార్మెన్స్ అని చాటి చెప్పింది. నిజ జీవితంలో జరిగిన ఒక సమస్యకి అధ్భుతమైన స్క్రీన్ ప్లే ని జోడించి కామెడీ తో చివరి దాకా ముంచెత్తారు. మేకర్స్ కూడా ఇది నిజంగా జరిగిన కథని టైటిల్స్ లోనే చెప్పారు. ఒక పది రోజుల పాటు జ్వరంతో ఇంటి పట్టునే ఉన్న వ్యక్తి ఒక్కసారిగా బయటకి రాగానే ఎంత ఆనందాన్ని పొందుతాడో, ఈ మూవీ ని చూసిన ప్రేక్షకుడు కూడా అంతే ఆనందాన్ని పొందుతాడు. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే సుబ్రహ్మణ్యం తో పాటుగా మిగతా అన్ని క్యారెక్టర్ల లక్ష్యం గురించి చెప్పేసి చివరి దాకా అదే టెంపో తో నడిపించడం చాలా బాగుంది.అందుకే ఇలాంటి కథ లని ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఆఫ్ అని ఉండదు. రెండు మూడు సీన్స్ తప్ప సినిమాలోని ప్రతి సీన్ కి ప్రేక్షకుడు నవ్వుతూనే ఉంటాడు .తండ్రి కొడుకుల మధ్య సీన్స్ చాలా కొత్తగా ఉన్నాయి. అలాగే మధ్య తరగతి మెంటాలిటీ ని చక్కగా చూపించారు.చాలా మంది భార్య భర్తలు ఇందులో చూపించిన విధంగానే ఉంటారు. కొన్ని మైనస్ లు ఉన్నా కూడా వాటిని కధనాలు కనిపించనివ్వలేదు. ఉదాహరణకి కళారాణి క్యారక్టర్ ఒక వ్యక్తితో మీరు చేసే మేలుని నేను మర్చిపోలేను అంటుంది. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలసింది. ఇక టైటిల్ ని కూడా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం & ఫ్యామిలీ అని పెట్టి ఉండాల్సింది. ఎందుకంటే అందరకి చక్కని క్యారెక్టర్స్ కుదిరాయి.అలాగే కళారాణి చేసే జాబ్ గురించి కూడా చెప్పుండాల్సింది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
ఇక సుబ్రమణ్యంగా రావు రమేష్ తన పాత్రలో ఒదిగిపోయిన తీరు రియల్లీ సూపర్. తన యాక్టింగ్ లెవల్లో ఎక్కడ బోర్ అనేది కొట్టకుండా టైలర్ మేడ్ నటన ని ప్రదర్శించాడు. కామెడీ సీన్స్ లో గాని, సెంటిమెంట్ సీన్స్ లో గాని నభూతో నభవిష్యతి అన్నరీతిన చేసాడు. ఇక అంకిత్ కొయ్య కూడా చాలా చక్కని పెర్ ఫార్మ్ చేసాడు. తన బ్యాక్ మూవీ ఆయ్ కంటే సూపర్ గా చేసాడు. తెలుగు తెరకి ఇంకో చక్కని యువ హీరో దొరికినట్టే, అలాగే ఈ తరం అమ్మాయిగా రమ్య పసుపులేటి కూడా చాలా చక్కగా చేసింది. ఇక ఇంద్రజ తెలుగు తెరపై బిజీ అవ్వడం ఖాయం. అంతగా తన నటనతో మెప్పించింది. ఇక ప్రముఖ రచయిత నటుడు హర్షవర్ధన్ కూడా రమ్య ఫాదర్ గా ఒక రేంజ్ పెర్ఫార్మ్ చేసాడు, అజయ్ కి ఇలాంటి క్యారెక్టర్స్ కొట్టిన పిండే. ఇక దర్శకుడు లక్ష్మణ్ విషయాన్ని వస్తే ఒక సింపుల్ కథ ని ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా డీల్ చేసాడు. పైగా రచయిత కూడా తనే కాబట్టి మాటలు కూడా సూపర్ గా పేలాయి. తెలుగు తెరకి లక్ష్మణ్ రూపంలో ఇంకో మంచి దర్శకుడు దొరికినట్టే. ఫొటోగ్రఫీ అయితే సినిమాకి ప్రాణం పోసింది. పాటలు పెద్దగా లేవు కానీ ఆర్ ఆర్ సూపర్ గా ఉంది.
తెలుగుఒన్ పర్స్పెక్టివ్:
ఫైనల్ గా చెప్పాలంటే... మూవీ అయితే కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. ప్రేక్షకులకి సరికొత్త నవ్వుల పండుగ ని తీసుకొచ్చింది. అదే టైం లో సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుదామనుకుంటున్న కొత్త రకం దర్శక రచయితలకి రేపటి మీద ఒక భరోసా ని కూడా ఇచ్చింది.
- అరుణాచలం