సినిమా పేరు: ఆయ్
తారాగణం: నార్నె నితిన్, నయన్ సారిక, అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, వినోద్, మైమ్ గోపి తదితరులు..
సంగీతం:రామ్ మిర్యాల,అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ:సమీర్ కల్యాణి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
రచన, దర్శకత్వం:అంజి కె.మణిపుత్ర
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాతలు: బన్నీవాసు,విద్యా కొప్పినీడి
బ్యానర్: గీత ఆర్ట్స్ 2
విడుదల తేదీ: అగస్ట్ 15 2024
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్(narne nithin)ఈ రోజు ఆయ్(aay)అంటు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పైగా ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలని అందించిన గీతా ఆర్ట్స్ ఒక యూత్ ఫుల్ సినిమా చేస్తుందంటే మూవీ లవర్స్ లో ఒకింత ఆసక్తి ఉండటం సహజం. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
కార్తీక్ (నార్నె నితిన్) హైదరాబాద్ లో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడి తన సొంత ఊరు అమలాపురం చేరుకుంటాడు. తన తండ్రి బురయ్య (వినోద్ కుమార్) అంటే కార్తీక్ కి చిన్నప్పటినుంచి కోపం. ఇక తన పక్క ఊరి కి చెందిన పల్లవి ( నయన్ సారిక)(nayan sarika)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. కాలేజీ లో చదువుకునే పల్లవి కూడా కార్తీక్ ని ప్రేమిస్తుంది. కార్తీక్ ఫ్రెండ్స్ హరి (అంకిత్ కోయ) సుబ్బు (రాజ్ కుమార్ కసిరెడ్డి) లు కూడా వాళ్ళిద్దరి ప్రేమ కి సహాయపడుతుంటారు. ఇలా జరుగుతున్న కథలో పల్లవి వేరే వ్యక్తితో పెళ్ళికి ఒప్పుకుంటుంది. పైగా నా తండ్రి (మైమ్ గోపి ) ఇష్టమే నా ఇష్టం అని ఖరాకండిగా చెప్తుంది. ఈ క్రమంలో కార్తీక్ ప్రేమ విషయం బూరయ్య కి కూడా తెలుస్తుంది. పల్లవి ఎందుకు వేరే వాళ్ళతో పెళ్లి కి రెడీ అయ్యింది? హరి, సుబ్బు లు కార్తీక్ ప్రేమ గెలవడానికి ఏమైనా చేసారా ? బూరయ్య ఏం చేసాడు ? అసలు కార్తీక్ ప్రేమ గెలుస్తుందా? లేదా అనేదే ఈ కథ.
ఎనాలసిస్ :
ఇలాంటి ప్రేమ కథలు గతంలో చాలా తెలుగు సినిమాలో వచ్చాయి. కానీ ప్రేమ విషయంలో అమ్మాయి ఆలోచించే విషయం కొత్తగా ఉంది. అదే ఈ సినిమాని నిలబెట్టింది. సినిమా మొత్తం ఒకే పాయింట్ మీద నడిచినా, చాలా సినిమాల్లో వచ్చిన కామెడీ అయినా కూడా కెమెరా పని తనం అండ్ నూతన నటి నటుల వల్ల కథనాలు కొత్తగా అనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ చూసుకుంటే హీరో, హీరోయిన్ మద్య ప్రేమ పుట్టడం చాలా సిల్లీగానే ఉంటుంది. బహుశా విలేజెస్ లో ఉండే అమ్మాయిలు అలా ఉంటారేమో. ఒక సమస్యని సృష్టించి హీరో దాన్ని సాల్వ్ చెయ్యగానే హీరోయిన్ హీరో ని ప్రేమించడం చూపిస్తే బాగుండేది. విలేజెస్ కాబట్టి ఆ అవకాశం కూడా ఉంది. ఇక కార్తీక్ లవ్ ట్రాక్ తో ముడిపడి ఫ్రెండ్స్ కథ కూడా ఉండటం చాలా బాగుంది.కాకపోతే కొన్ని చోట్ల శృతిమించింది. అంత భూతులు అవసరం లేదు. అలాగే వినోద్ కుమార్ లాంటి నటుడు కొడుకు ఎన్ని మాటలు అంటున్నా కూడా మౌనంగా భరిస్తూ ఉంటాడు. కానీ కథ కి ఆయనే కీలకం అయ్యుంటాడు, అదెలా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుడికి మొదటి నుంచి వచ్చేలా చెయ్యడం బాగుంది. ఇక సెకండ్ ఆఫ్ కూడా హీరో హీరోయిన్ ,ఫ్రెండ్స్ చుట్టూనే నడవడం వలన ఫస్ట్ ఆఫ్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంటుంది. దీంతో ప్రేక్షకుడు రొటీన్ డ్రామా తో విసుగు చెందుతున్నాడు అనంగ చివరి 20 నిముషాలు కథ లో వేగం పెరిగింది. అంతే కాదు టోటల్ సినిమాకే ఆయుపట్టువుగా నిలిచి అంతకు ముందు ఉన్న లోపాలన్నింటిని మర్చిపోయేలా చేసింది. పైగా థియేటర్స్ లో చప్పట్ల వర్షాన్ని కూడా కురిపించింది. ప్రస్తుత ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ని కూడా ఇచ్చింది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
నార్నె నితిన్ సూపర్ గా చేసాడు, డాన్స్ , లవ్ అండ్ సెంటిమెంట్ సీన్స్ లో తనకి తిరుగులేదని నిరూపించాడు. అలాగే భవిష్యత్తులో తన నుంచి మంచి సినిమాలు వస్తాయనే నమ్మకాన్ని ప్రేక్షకులకి ఇవ్వడంలో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు. ఇక హీరోయిన్ అయితే ఒక రేంజ్ లో పెర్ఫార్మ్ చేసింది.మొదటి సినిమా అయినా కూడా ఎటువంటి బెరుకు లేకుండా చేసింది. మంచి అవకాశాలు వస్తే టాప్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నితిన్ ఫ్రెండ్స్ గా చేసిన ఇద్దరు యువ నటులునే పెర్ ఫార్మ్ ఒక మోస్తరుగానే ఉంది. క్యారెక్టర్ మాత్రమే కనడేలా చెయ్యడంలో ఒక మాదిరిగానే సక్సెస్ అయ్యారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో అది స్పషంగా కనపడుతుంది. కాకపోతే కొన్ని సీన్స్ లో మాత్రం బాగా చేశారు. ఇక దర్శకుడు విషయానికి వస్తే తొలి సినిమా అయినా కూడా బాగానే తెరకెక్కించాడు. ఆల్ ఆర్టిస్ట్ నుంచి మంచి నటన నే రాబట్టాడు.ఇక కెమెరా పని తనం అయితే ఒక రేంజ్ లో ఉంది. పైగా సినిమాకి రిచ్ లుక్ ని తెచ్చిపెట్టింది. దాంతో నిర్మాణ విలువలు కూడా బాగున్నాయనే ఫీలింగ్ ని కలిగించింది. పాటలు అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది.
తెలుగుఒన్ పర్స్పెక్టివ్:
ఫైనల్ గా చెప్పాలంటే... హీరో, హీరోయిన్, వినోద్ కుమార్, మైమ్ గోపిలు ఆయ్ ని కాపాడారు. అదే విధంగా రొటీన్ సినిమా అనే ముద్ర నుంచి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన చిత్రంగా కూడా నిలిచింది.
- అరుణాచలం