టాలీవుడ్‌లోని అత్యంత పాపులర్ నటులలో ఒకరైన విజయ్ దేవరకొండ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనకు లగ్జరీ కార్లు, ప్రొడక్షన్ హౌస్, బట్టల బ్రాండ్ లాంటివి ఉన్నాయి. ఇటీవలి కాలంలో, విజయ్ దేవరకొండ అత్యంత విజయవంతమైన నటులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. తను ఎంచుకున్న సినిమాలు, తన గుడ్ లుక్స్‌తో అతి వేగంగా పాపులారిటీ సాధించాడు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే విజయ్, ఎల్లప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉంటాడు. వారిని తరచుగా తనకు సంబంధించిన అప్‌డేట్స్‌తో ఆనందపరుస్తూ ఉంటాడు.
అవి మునుపటి కాలానికి చెందిన పిక్చర్స్ అవనీ, ఫ్యామిలీ పిక్చర్స్ కానీ, తన పెట్స్ అందమైన ఇమేజెస్ కానీ.. విజయ్ ఒక కంప్లీట్ సోషల్ మీడియా స్టార్! విజయ్ ప్రస్తుతం తన కెరీర్లో పీక్ స్టేజ్‌లో ఉన్నాడు. తన సినిమాల ద్వారా అయినా లేదా టీవీ వాణిజ్య ప్రకటనల ద్వారా అయినా, టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఆయన ఒకడు.
హీరోగా తన మొదటి చిత్రం 'పెళ్లిచూపులు'కు ఆయన అందుకున్న రెమ్యూనరేషన్ రూ. 6 లక్షలు. 'అర్జున్‌రెడ్డి' మూవీ బ్లాక్‌బస్టర్ అయ్యాక, వెంటనే ఆయన రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'లైగర్' కోసం ఆయన తీసుకుంటున్న పారితోషికం రూ. 10 కోట్లుగా చెప్పుకుంటున్నారు.
సినిమాలు, యాడ్స్ ద్వారా ఇంతదాకా విజయ్ సంపాదించిన నికర విలువ రూ. 30 కోట్లు అని అంచనా. సినిమాలు కాకుండా యాడ్స్ ద్వారా నెలకు ఆయన సగటున రూ. 50 లక్షల దాకా సంపాదిస్తున్నాడు. ఇటీవల విజయ్ దేవరకొండ హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ఒక కొత్త ఇంటిని కొన్నాడు. దీని ధర దాదాపు రూ. 15 కోట్లు. అలాగే అతని గ్యారేజ్‌లో రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, ఆడి లాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
సినిమాలు, యాడ్స్‌లో నటిస్తుండటంతో పాటు, ఆయన పలు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్‌లో కూడా పెట్టుబడి పెట్టాడు. ఆయనకు 'రౌడీ వేర్' అనే సొంత క్లాత్ బ్రాండ్ ఉంది. ఇటీవల నిర్మాతగా కూడా మారి 'కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్‌టైన్‌మెంట్' అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేశాడు.