దేశాన్ని ధ్వంసం చేసిన కోవిడ్-19 తో యుద్ధం చేయడానికి ప్రభాస్ 'రాధే శ్యామ్' నిర్మాతలు ముందుకు వచ్చారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఉపయోగించిన హాస్పిటల్ సెట్ ఆస్తిని మేకర్స్ విరాళంగా ఇచ్చారు. 50 కస్టమ్ బెడ్‌లు, స్ట్రెచర్లు, పిపిఇ సూట్లు, మెడికల్ ఎక్విప్‌మెంట్ స్టాండ్‌లు, ఆక్సిజన్ సిలిండర్లతో కూడిన హాస్పిటల్ సెట్‌ను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు.
'రాధే శ్యామ్' షూటింగ్ కొన్ని సీన్లు మినహా దాదాపు పూర్తయింది. హాస్పిటల్ సెట్‌ను హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ స్టూడియోలో నిర్మించారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయినందున, నిర్మాతలు ఆ సెట్‌ను కూల్చివేసి నగరంలోని ఓ గిడ్డంగికి తరలించారు. దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడం వల్ల వైద్య పరికరాల కొరత, అవసరం కూడా పెరిగాయి. అందువల్ల, సెట్ ప్రాపర్టీని హైదరాబాద్‌లోని ఆసుపత్రికి దానం చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
'రాధే శ్యామ్' ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి ఈ వార్తను ధ్రువీకరించారు. ఆయన మాట్లాడుతూ, “ఈ బెడ్లను అనుకూలంగా రూపొందించబడ్డాయి. అవి పెద్దవి, బలమైనవి, రోగికి సౌకర్యంగా ఉండేవి. మంచం పట్టిన రోగికి అనుకూలంగా అన్ని రకాల సౌకర్యాలు వాటికి ఉన్నాయి.” అని చెప్పారు.