
సన్నీలియోన్ కి ముంబై కోర్టు శుభవార్త.. ఫ్యాన్స్ లో జోష్
హీరోయిన్స్ లో ఇండియా వ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించిన వాళ్లలో సన్నీ లియోన్ ఒకరు. స్టిల్ ఈ టైంలో కూడా యూట్యూబ్ లో సన్నీలియోన్ వీడియోస్ చూసే అభిమానులకి లెక్కే లేదు. అసలు 'స' అంటేనే సన్నీలియోన్ అనేలా తన హవా కొనసాగిన రోజులు కూడా ఉన్నాయి.రీసెంట్ గా సన్నీ లియోన్ కి ఆమె భర్త డానియెల్ వెబర్,వారి మేనేజర్ రజానీలకు ముంబైలోని దిండోషి అదనపు సెషన్స్ కోర్టులో భారీ ఊరట లభించింది. ఒక తెలుగు సినిమా ఆఫర్ లావాదేవీల విషయంలో దాఖలైన 70 లక్షలకు పైగా కమీషన్ బకాయిల మోసం కేసును కోర్టు పూర్తిగా కొట్టివేసింది. టాలెంట్ కోఆర్డినేటర్ ఓం ప్రకాశ్ శ్రీనారాయణ్ జైన్ దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను విచారించిన అదనపు సెషన్స్ జడ్జి పీఏ సానే, ఈ వివాదం కేవలం సివిల్ మరియు వ్యాపారపరమైన ఒప్పందానికి సంబంధించినదని, ఇందులో ఎలాంటి క్రిమినల్ కోణం లేదని స్పష్టం చేశారు. ఈ వివాదం గతంలో సన్నీ లియోన్ నటించిన ఒక తెలుగు చిత్రానికి సంబంధించిన లావాదేవీలతో మొదలైంది. ఫిర్యాదుదారుడైన ఓం ప్రకాశ్ జైన్ కథనం ప్రకారం, ఆ సినిమా కోసం సన్నీ లియోన్ కి 1.75 కోట్ల రూపాయల మేర రెమ్యూనరేషన్ ఒప్పందం కుదిరింది. ఆ మొత్తంలో తనకు 10 శాతం కమిషన్ చెల్లించేలా అంగీకారం కుదిరిందని, సన్నిలియోన్ కి తొలి విడతగా 35 లక్షలు అందగా 1.75 లక్షలు మాత్రమే కమిషన్ ఇచ్చారు. ఆ తర్వాత జూలై 20, 2022న మరో. 3.50 లక్షల మొత్తం చెల్లించారని, అయితే చివరి విడతగా నటికి అందిన 70 లక్షల బకాయిల నుండి తనకి రావాల్సిన కమిషన్ మరియు 10 శాతం ఇన్సెంటివ్ను ఇవ్వకుండా నమ్మకద్రోహానికి పాల్పడ్డారని జైన్ కోర్టుని ఆశ్రయించాడు. ఈ కేసుని పరిశీలించిన అందేరి మేజిస్ట్రేట్ కోర్టు, 2024 అక్టోబర్ 10న జైన్ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును తిరస్కరించింది. జైన్ దీనిని సవాలు చేస్తూ దిండోషి అదనపు సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. సన్నీ లియోన్ దంపతుల తరఫు న్యాయవాది రాజ్‌కుమార్ మిశ్రా వాదనలు వినిపిస్తూ, ఇది పూర్తిగా రెండు వర్గాల మధ్య జరిగిన వ్యాపార ఒప్పందమని, ఆరంభం నుంచీ మోసం చేసే ఉద్దేశం తమ క్లయింట్‌కు లేదని వివరించారు. కేసులో సమర్పించిన ట్యాక్స్ ఇన్వాయిస్లు, ఫారమ్ 16-ఏ కాపీలు మరియు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం, ఇది సాధారణ వాణిజ్య లావాదేవీ అని నిర్ధారించింది. Also Read: స్టార్ హీరోల ఫ్యాన్స్‌కి నిరాశ.. టాలీవుడ్లో రీ రిలీజ్‌ల రచ్చ ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించలేక పోవడం లేదా చెల్లింపుల్లో వ్యత్యాసాలు రావడమనేది కేవలం ఒప్పంద ఉల్లంఘన (బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్) మాత్రమే అవుతుందని, దానికి మోసం (Cheating) లేదా క్రిమినల్ నమ్మకద్రోహం (Criminal Breach of Trust) వంటి రంగులు పులమలేమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. భారతీయ న్యాయ సంహిత లేదా ఐపీసీ సెక్షన్ 406, 420, 506(II) కింద నేరం నిరూపితమయ్యే ఆధారాలు లేవని పేర్కొంటూ, మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన పాత ఉత్తర్వులను అదనపు సెషన్స్ కోర్టు సమర్థించింది. దీనితో సన్నీ లియోన్, డానియెల్ వెబర్ దంపతులకు ఈ కేసు నుంచి విముక్తి లభించింది. Sunny leone, Daniel Weber, Tollywood, TeluguCinema,TeluguNews,TeluguCinemaNews, TeluguOneDotCom, Bollywood
Aug 27, 2026 6:04PM
ప్రముఖ సింగర్ దారుణహత్య
ప్రముఖ హర్యానా జానపద గాయకుడు, ప్రసిద్ధ యూట్యూబర్ అంకిత్ బాలియాన్ దారుణ హత్యకి గురయ్యాడు. రోజూలాగే ఆర్యాపురి వద్ద ఉన్న ఫిట్నెస్ జిమ్‌లో వర్కౌట్ పూర్తి చేసుకుని, సాయంత్రం 6:55 గంటల సమయంలో బయటకు వచ్చి తన ఎస్యూవీ (SUV) వైపు వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. అప్పటికే రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చి కాపుకాసిన నలుగురు అజ్ఞాత దుండగులు ఒక్కసారిగా ఆయన వాహనం తలుపులు తెరిచి తుపాకీతో కాల్పుల వర్షం కురిపించారు. దుండగులు దాదాపు 18 రౌండ్ల పాటు కాల్పులు జరపగా, అంకిత్ శరీరంలోకి 5 బుల్లెట్లు నేరుగా దిగిపోయాయి. దీంతో ఆయన అక్కడికక్కడే తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయారు. ఘటనా స్థలానికి సమీపంలోనే ఉన్న పోలీసులు ఆయనను వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించినప్పటికీ, ఆలోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘోర ఉదంతంలో అత్యంత విషాదకరమైన మరియు విస్తుపోయే విషయం ఏమిటంటే, అంకిత్ హత్యకు గురైన తీరు ఆయన రూపొందించిన పాటలని, సోషల్ మీడియా పోస్టులని అచ్చుగుద్దినట్లు పోలి ఉండటం. ఆయన గతంలో పాడిన "భారీ కోర్టులో నిన్ను కాలుస్తాం నా ప్రాణమా" అనే హిట్ పాట మరియు హత్యకు కేవలం ఒక గంట ముందు ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన "రోడ్డుపై హత్య చేస్తాం" అనే లిరిక్స్ ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆయన నిజ జీవితంలో భయానక రీతిలో ఆ నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. యూట్యూబ్‌లో 3.66 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్న అంకిత్, తన పాటలలో గన్ కల్చర్, దేశీ యాటిట్యూడ్, గ్రామీణ నేపథ్యాలను చూపిస్తూ యువతలో విశేష ప్రజాదరణ పొందారు. Also Read: ఆ వ్యక్తితో చెప్పులు మోయించిన హీరోయిన్ రెజీనా.. వైరల్ వీడియోపై విమర్శల జోరు ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలపై పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఢిల్లీకి చెందిన ప్రముఖ 'గోగి గ్యాంగ్' ఈ హత్యకి తామే బాధ్యులమని ప్రకటించుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపుతుంది. ఉత్తరప్రదేశ్ లోని శ్యామ్లీ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకోగా అంకిత్ వయసు 32 సంవత్సరాలు. Ankit Balyan, Haryanvi Singer, Bollywood,Tollywood, TeluguCinema, TeluguNews TeluguCinemaNews , TeluguOneDotCom
Aug 27, 2026 3:27PMకృతి సనన్ రాఖీ యాడ్ వివాదం: క్షమాపణలు చెబుతూ వీడియోను తొలగించిన జ్యువెలరీ సంస్థ.!
బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కృతి సనన్ నటించిన ఒక కమర్షియల్ యాడ్ ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రముఖ జ్యువెలరీ సంస్థ 'జీవా' రక్షాబంధన్ సందర్భాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఈ ప్రకటనపై నెటిజన్ల నుంచి, సినీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. రక్షాబంధన్ పండుగ ప్రాశస్త్యాన్ని తక్కువ చేసి చూపేలా ఈ యాడ్ ఉందంటూ కామెంట్లు రావడంతో సదరు సంస్థ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ప్రముఖ బ్రాండ్ జీవా విడుదల చేసిన దాదాపు 36 సెకన్ల ఈ వాణిజ్య ప్రకటనలో కృతి సనన్ ఇండో-వెస్ట్రన్ గ్లామరస్ అవుట్‌ఫిట్‌లో కనిపించారు. అయితే, ఆ వీడియోలో ఆమె తన సోదరుడితో పాటు ఒక పెంపుడు శునకానికి కూడా రాఖీ కడుతున్నట్లు చూపించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్రమైన రక్షాబంధన్ పండుగలో సాంప్రదాయ దుస్తులు కాకుండా బోల్డ్ దుస్తులు ధరించడం, పెంపుడు జంతువును చేర్చడం సంస్కృతిని అవమానించడమేనని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. ఈ వివాదంపై ఫైర్‌బ్రాండ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ కూడా ఘాటుగా స్పందించారు. "సోదరుడికి రాఖీ కట్టే సమయంలో ఇలాంటి దుస్తులు ధరిస్తారా?" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాంప్రదాయ పండుగల వేళ ఇలాంటి ప్రచారాలు చేయడం సంస్కృతిని విస్మరించడమేనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లతో పాటు ప్రముఖుల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో జీవా జ్యువెలరీ సంస్థ దిగొచ్చింది. బుధవారం ఈ వివాదంపై అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. తమకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు పండుగల పట్ల ఎంతో గౌరవం ఉందని తెలిపింది. కేవలం అనుబంధాన్ని చాటిచెప్పే ఉద్దేశంతోనే ఈ వీడియోను రూపొందించామని, అయితే ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరింది. వివాదం ముదరకుండా ఉండేందుకు అన్ని సోషల్ మీడియా వేదికల నుంచి, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఈ రాఖీ యాడ్‌ను తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. వివాదాల సంగతి పక్కన పెడితే, కృతి సనన్ ప్రస్తుతం వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, సొంతంగా నిర్మాణ రంగంలోనూ రాణిస్తున్నారు. Kriti Sanon Dress Controversy, Giva Jewelry Rakhi Ad Controversy, Kangana Ranaut Criticism Kriti Sanon, Bollywood News Telugu, TeluguOne Entertainment News
Aug 26, 2026 6:34PM.webp)
'హైవాన్' ట్రైలర్: విలన్‌గా అక్షయ్ కుమార్ విశ్వరూపం.!
అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్న సినిమా "హైవాన్". సరికొత్త థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీతో ఫస్ట్ టైమ్ నెగిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. 'హైవాన్' సినిమా సెప్టెంబర్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'హైవాన్' మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ ట్రైలర్ లో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ మధ్య పోరాటం హైలైట్ గా నిలుస్తోంది. నెక్ట్స్ ఏం జరుగుతుంది అని ఆసక్తిని రేపే సన్నివేశాలతో ట్రైలర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఒక యూనిక్ థ్రిల్లర్ మూవీని థియేటర్స్ లో చూడబోతున్న అనుభూతిని ట్రైలర్ తో కలిగించారు డైరెక్టర్ ప్రియదర్శన్. అక్షయ్ కుమార్ ఇప్పటిదాకా ఆయన కెరీర్ లో కనిపించనంత డార్క్ అవతార్ లో ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ దివ్యాంగుడిగా ఛాలెంజింగ్ రోల్ ప్లే చేస్తున్నారు. వీరి మధ్య జరిగే సంఘర్షణ ఉత్కంఠ రేపుతోంది. వీరి పోరాటంలో విజయం ఎవరిది ? అనేది సినిమాలో చూడాలి. బోమన్ ఇరానీ జడ్జిగా, సయామీ ఖేర్ పోలీస్ అధికారిగా కనిపించి ఆకట్టుకున్నారు. శ్రియా పిల్గాంకర్, షరీబ్ హష్మీ ఇతర కీలక పాత్రల్లో మెరిశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన 'హైవాన్' ఫస్ట్ లక్ పోస్టర్, టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. 'హైవాన్' మూవీతో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని నిర్మాతలు వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. Haiwaan Trailer, Akshay Kumar, Saif Ali Khan, Priyadarshan
Aug 25, 2026 4:28PM
కాపీ వివాదంలో తాప్సీ గాంధారి మూవీ
తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు తాప్సీ పన్ను. బాలీవుడ్ లో తనదైన శైలిలో దూసుకుపోతు 'గాంధారి' తో సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటిటిలో అడుగుపెట్టబోతుంది.ఇప్పుడు ఈ మూవీకి కాపీరైట్ ఆరోపణలు, కథా చౌర్యం వివాదాలు చుట్టుముట్టాయి. కణికా ధిల్లాన్ నిర్మాణం మరియు రచనలో, దేవాశిష్ మఖిజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సీ పన్నా 'బానీ' అనే శక్తివంతమైన తల్లి క్యారక్టర్ పోషించారు. కిడ్నాప్‌కు గురైన తన కుమార్తెను కాపాడుకోవడానికి ప్రమాదకరమైన నేర ప్రపంచంలోకి అడుగుపెట్టి పోరాడే ఒక తల్లి భావోద్వేగ ప్రయాణమే ఈ చిత్ర ముఖ్య కథాంశం. గాంధారి కథపై ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి, ప్రస్తుతం సెంట్రల్ జీఎస్టీ ,కస్టమ్స్ విభాగంలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న కళ్యాణ్ బండి మాట్లాడుతూ '2019లో 'గాంధారి' అనే పేరుతో ఒక కథని పూర్తి చేసి, దానిని స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ (SWA)లో అధికారికంగా రిజిస్టర్ చేయించుకున్నాను. 2019 లోనే లింక్డ్ఇన్ (LinkedIn) వేదికగా అప్పట్లో 'వూట్' (Voot) డిజిటల్ సంస్థలో కీలక బాధ్యతల్లో ఉన్న మోనికా షెర్గిల్‌ను సంప్రదించి, కథకి సంబంధించిన 8 పేజీల సమగ్ర వివరణతో పాటు 2 పేజీల కథా సారాంశాన్ని (Synopsis) ఆన్లైన్ ద్వారా పంపించాను. చైల్డ్ ట్రాఫికింగ్ అక్రమ రవాణా ముఠా చేతిలో చిక్కుకున్న తన సంతానాన్ని కాపాడుకోవడానికి ఒక తల్లి చేసే సాహసోపేతమైన పోరాటమే నా కథలోని ప్రధాన ప్లాట్. 'గాంధారి' సినిమా కాన్సెప్ట్, శీర్షిక మరియు ఆత్మ తన రిజిస్టర్డ్ కథతో 100% సరిపోలుతున్నాయని కళ్యాణ్ బండి చెప్తున్నారు. Also read: ఇరుముడి మణమ్మ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే.. తండ్రి లేడు మరొ వైపు ముంబైకి చెందిన రచయిత రాఘవ్ దేశాయ్ కూడా 2024లో తాను పిచ్ చేసిన స్క్రిప్ట్‌ను కాపీ చేసి కణికా ధిల్లాన్ పేరుతో వాడుకుంటున్నారని ఆరోపణలు చేయడంతో ఈ వివాదం సోషల్ మీడియాలో మరింత వేడెక్కింది. ఈ క్రమంలో ఈ తీవ్రమైన ఆరోపణలపై గాంధారి చిత్ర నిర్మాణ సంస్థ 'కథా పిక్చర్స్' (Kathha Pictures) అధికారికంగా స్పందిస్తూ సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. సామాజిక మాధ్యమాలు మరియు కొన్ని పత్రికల్లో వస్తున్న కాపీరైట్ వ్యాఖ్యలన్నీ పూర్తిగా నిరాధారమైనవని, అబద్ధాలని సంస్థ స్పష్టం చేసింది. 'గాంధారి' అనేది రచయిత్రి కణికా ధిల్లాన్ స్వయంగా సృష్టించిన సొంత ఆలోచన అని, దీని కథ మరియు స్క్రీన్‌ప్లే పూర్తిగా ఆమె ఒరిజినల్ వర్క్ అని వెల్లడించింది. ఎలాంటి ఆధారాలు లేని ఇటువంటి వార్తలను ప్రచారం చేయవద్దని మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను కోరింది. సెప్టెంబర్ 3 విడుదల సమయానికి ఈ కాపీ వివాదం ఏ మలుపు తిరుగుతుందో అని ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. Taapsee Pannu, Gandhari, Kanika Dhillon, Kalyan Bandi
Aug 25, 2026 10:58AM
70 ఏళ్ల నిర్మాతతో రిలేషన్షిప్... కారు, ఇల్లు ఇస్తా అన్నాడు!
సినిమా.. ఓవర్ నైట్ స్టార్ డమ్ ని తీసుకురావడంతో పాటు న్యాయబద్దంగా కోట్ల రూపాయలని తెచ్చిపెడుతుంది. మూడు తరాలు పాటు కుర్చీని తిన్నా తరిగిపోని ఆస్తులని కూడా ఇవ్వడంలో సినిమా పెద్ద స్పెషలిస్ట్. కాకపోతే అవకాశాలు రావడం కష్టమైన పని. అలాంటి సినిమా వెనుక చీకటి కోణాలు కూడా ఉంటాయనే విషయం మరోసారి నిరూపితమైంది. సంచలన వెబ్ సిరీస్ 'మిర్జాపూర్'లో 'జరీనా' పాత్రతో దేశవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఖ బాలీవుడ్ నటి అనంగ్షా బిస్వాస్. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతు 'నాతో 70 ఏళ్ల వయసున్న ప్రొడ్యూసర్ నువ్వు మంచి నటివే, కానీ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చావు కాబట్టి ముంబైలో ఎక్కువ కాలం సర్వైవ్ కాలేవు. నాతో సంవత్సరం పాటు ఉంటే నీకు లగ్జరీ కారు, ఇల్లు ఇస్తాను. సినిమాల్లో కూడా మంచి అవకాశాలు ఇప్పిస్తానని ఆఫర్ చేసాడు. ఆ మాటలు వినగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను అంత చెత్త నటినా? నా నటనపై నాకు నమ్మకం ఉంది, అవకాశాల కోసం ఇలాంటి పనులు చేయాలా?” అని మానసికంగా చాలా రాత్రులు కుమిలిపోయాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రతిపాదనకు లొంగకూడదని నిర్ణయించుకోవడంతో పాటు మా నాన్నకి చెప్తే సినిమాలు వద్దంటారని చెప్పలేదు. రీల్ లైఫ్‌లో నేను పోషించే బోల్డ్, నెగటివ్ షేడ్ క్యారెక్టర్స్ చూసి, రియల్ లైఫ్‌లో కూడా అలాగే ఉంటానని కొందరు నెటిజన్లు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నారు. తెరపై చూసే పాత్రల ఆధారంగా నిజ జీవిత వ్యక్తిత్వాన్ని అంచనా వేయవద్దని కూడా అనంగ్షా చెప్పుకొచ్చింది. Also Read: వంశపారంపర్యంగా వస్తున్న వాళ్ళని కాపాడిందా! 2007లో 'ఖోయా ఖోయా చంద్' సినిమాతో వెండితెరకు పరిచయమైన అనంగ్షా, ఆ తర్వాత 'లవ్ షువ్ తే చికెన్ ఖురానా', 'హోస్టేజెస్' వెబ్ సిరీస్, 'బస్తర్: ది నక్సల్ స్టోరీ' వంటి ప్రాజెక్ట్‌లతో వైవిధ్యమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సెప్టెంబర్ లో 'మిర్జాపూర్: ది మూవీ' తో మరో సారి సందడి చేయనుంది. Anangsha Biswas, Casting Couch Experience, Mirzapur Actress Zarina
Aug 24, 2026 2:33PMకంగనా vs తాప్సీ: తల్లిదండ్రులపైకి వెళ్లిన బాలీవుడ్ హీరోయిన్ల ఫైట్.!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ చిన్న అవకాశం చిక్కినా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకునే ఫైర్ బ్రాండ్ నటీమణులు కంగనా రనౌత్, తాప్సీ పన్నుల మధ్య వివాదం మరోసారి భగ్గుమంది. వీరిద్దరి మధ్య ఏళ్ల తరబడి సాగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు ఏకంగా తల్లిదండ్రుల పెంపకం స్థాయికి వెళ్లిపోవడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల జరిగిన ఒక సమ్మిట్ ఇంటర్వ్యూలో తాప్సీ పాల్గొని మాట్లాడారు. ఈ క్రమంలో కంగనాతో ఉన్న విభేదాల గురించి ప్రశ్నించగా.. "ఆమె మాట్లాడే తీరు, ప్రవర్తన ఆమె పెంపకాన్ని మరియు పెరిగిన వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. నేను వ్యక్తిగతంగా మాట్లాడే తీరు నా పెంపకానికి అద్దం పడుతుంది" అని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో కంగనా రనౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదికగా తాప్సీపై విరుచుకుపడ్డారు. "ప్రమోషన్ల కోసం ప్రతీసారి నా పేరు వాడుకోవడమే కాకుండా, ఈసారి ఏకంగా నా తల్లిదండ్రులను, నా పెంపకాన్ని విమర్శించే స్థాయికి వెళ్లడం హద్దులు దాటడమే. నా తల్లిదండ్రుల్లా ఒక ఒరిజినల్ క్యారెక్టర్‌ను ఎందుకు తయారు చేయలేకపోయారో అని ఆమె తల్లిదండ్రులను చూస్తే జాలేస్తోంది" అంటూ ఘాటుగా రీకౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి 2019లో వచ్చిన 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమా సమయం నుంచే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. అప్పట్లో కంగనా సోదరి రంగోలి, తాప్సీని "సస్తి కాపీ" (చౌకబారు నకలు) అని విమర్శించడం, ఆ తర్వాత నేపోటిజం చర్చలో "బి-గ్రేడ్ నటి" అని కంగనా అభివర్ణించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇద్దరూ స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చి 'అవుట్‌సైడర్స్'గా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, విభిన్నమైన సిద్ధాంతాల కారణంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం తాప్సీ నటించిన యాక్షన్ డ్రామా 'గాంధారి' సెప్టెంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్స్ సమయంలో రాజుకున్న ఈ కొత్త వివాదం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వీళ్లిద్దరి మధ్య ఉన్న ఈ మాటల యుద్ధం ఇక్కడితో ముగుస్తుందా లేక మరింత ముదురుతుందా అని నెటిజన్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే కంగనా సినిమాల్లో నటిస్తుండగా, తాప్సీ కూడా బ్యాక్ టు బ్యాక్ ఓటీటీ మరియు థియేట్రికల్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.
Aug 23, 2026 4:51PMబుల్లి తెరపై బ్లాక్‌బస్టర్ సీరియల్.. ఇప్పుడు సినిమాగా రాబోతోంది.!
భారతీయ బుల్లితెర చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ నేచురల్ డ్రామా సీరియల్ 'నాగిన్' ఇప్పుడు వెండితెరపైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. గత పది సంవత్సరాలకు పైగా బుల్లితెర ప్రేక్షకులను ఊపేసిన ఈ ఐకానిక్ ఫ్రాంచైజీని సినిమాగా మలచబోతున్నట్లు ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ అధికారికంగా ప్రకటించారు. నాగ్ పంచమి శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఈ బిగ్ అప్డేట్ను బయటకు వదలడంతో బాలీవుడ్ వ్యాపార వర్గాలతో పాటు ప్రేక్షక లోకంలోనూ భారీ చర్చ నడుస్తోంది. బాలాజీ టెలిఫిలిమ్స్ బ్యానర్‌పై ఏక్తా కపూర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. 2015లో ప్రారంభమైన 'నాగిన్' సిరీస్ ఇప్పటివరకు 7 దిగ్విజయవంతమైన సీజన్లను పూర్తి చేసుకుంది. మౌనీ రాయ్, అదా ఖాన్, సురభి జ్యోతి, నియా శర్మ, తేజస్వి ప్రకాశ్, ప్రియాంక చాహర్ చౌదరి వంటి ఎందరో తారలు ఇచ్చాధారి నాగిన్ పాత్రలలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ఈ పాపులర్ సూపర్ నేచురల్ వరల్డ్‌ను సరికొత్త విజువల్ ఎఫెక్ట్స్ (VFX), భారీ గ్రాఫిక్స్ మరియు పౌరాణిక ఫాంటసీ కథాంశంతో బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌గా అందించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సినిమాల్లో ఈ నాగిన్ పాత్రను ఎవరు పోషించనున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. ఈ సంచలన ప్రకటన సోషల్ మీడియాలో రావడంతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా స్పందిస్తున్నారు. టివి స్క్రీన్‌పై అదరగొట్టిన ఈ ఇచ్చాధారి నాగిన్ కథ, వెండితెరపై భారీ స్కేల్లో ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తుందో చూడాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులలో ఉన్న ఈ సినిమా కాస్టింగ్, దర్శకుడికి సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. ఏక్తా కపూర్ నుంచి వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ వెండితెరపై ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి.
Aug 18, 2026 5:32PMఅమితాబ్ బచ్చన్‌కు అద్దెల రూపంలోనే ఎన్ని కోట్లు ఆదాయం వస్తుందో తెలుసా.?
భారతీయ సినీ జగత్తులో షెహన్షాగా పేరుగాంచిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, వెండితెరపైనే కాకుండా రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంలోనూ తనదైన శైలిలో రాణిస్తున్నారు. సినిమాల ద్వారా సంపాదిస్తూనే, తెలివైన పెట్టుబడులతో కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ముంబైలోని తన కమర్షియల్ ఆస్తులను లీజుకు ఇవ్వడం ద్వారా బిగ్ బి భారీ ఆదాయాన్ని సొంతం చేసుకున్నారనే వార్త పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త ఒప్పందం ప్రకారం ఆయనకు ప్రతి నెలా భారీ మొత్తంలో అద్దె లభించనుంది. ముంబై అంధేరి వెస్ట్ పరిధిలోని ఓషివారా లింక్ రోడ్లో ఉన్న 'సిగ్నేచర్' భవనంలోని దాదాపు 8,428 చదరపు అడుగుల వైశాల్యం గల మూడు ఆఫీస్ అంతస్తులను ఆయన ఒక ప్రముఖ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ సంస్థకు లీజుకు ఇచ్చారు. ఐదేళ్ల కాలపరిమితితో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా నెలకు ఏకంగా రూ. 33 లక్షల అద్దె అమితాబ్‌కు అందనుంది. ఈ లీజ్ అగ్రిమెంట్ ప్రకారం ఐదేళ్ల వ్యవధిలో బిగ్ బికి అద్దె రూపంలోనే సుమారు రూ. 21.88 కోట్ల ఆదాయం సమకూరనుంది. దీనికి తోడు ముందస్తుగా రూ. 1.98 కోట్లను డిపాజిట్‌గా స్వీకరించినట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా అద్దెపై 5 శాతం పెంపు నిబంధన కూడా ఇందులో చేర్చడం విశేషం. ఇదే సిగ్నేచర్ బిల్డింగ్‌లోని మరికొన్ని యూనిట్లను గతేడాది ఒక ప్రముఖ మ్యూజిక్ కంపెనీకి లీజుకి ఇవ్వగా, దాని ద్వారా ప్రతి నెలా రూ. 17.30 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. ముంబై జుహూలోని ఆయన నివాసం 'జల్సా' విలువ రూ. 100 కోట్లకు పైగా ఉండగా, మరికొన్ని భవనాలను సైతం బ్యాంకులు, కార్పొరేట్ ఆఫీసులకు అద్దెకు ఇచ్చారు. కేవలం ముంబైకే పరిమితం కాకుండా అయోధ్య, అలీబాగ్ వంటి ప్రాంతాల్లోనూ బిగ్ బి ఇటీవల కోట్ల రూపాయల విలువైన భూములను కొనుగోలు చేశారు. ఈ రీతిలో తెలివైన పెట్టుబడులతో నిరంతరం తన ఆస్తులను పెంచుకుంటూ సినీ స్టార్లకు ఒక రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. అమితాబ్ బచ్చన్ రియల్ ఎస్టేట్ వ్యూహాలు మరియు ఈ భారీ అద్దె ఆదాయం గురించి విన్న అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బిగ్ బి బిజినెస్ సెన్స్‌ను ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఆయన తదుపరి చిత్రాలైన భారీ ప్రాజెక్టుల అప్డేట్స్ కోసం కూడా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Aug 18, 2026 3:18PM
జ్ఞాపకశక్తి కోల్పోయిన ప్రముఖ హీరోయిన్.. ఆందోళనలో ఫ్యాన్స్
సినిమాల్లో ఏదైనా కీలక సన్నివేశం జరుగుతున్నపుడు హీరో, హీరోయిన్స్ తో పాటు కొన్ని కీలకమైన క్యారెక్టర్స్ సడన్ గా జ్ఞాపకశక్తిని కోల్పోవడం జరుగుతుంది. దీంతో అక్కడ జరుగుతుంది నటన అని తెలిసినా క్యారెక్టర్స్ తో కనెక్ట్ అయిన ప్రేక్షకులు ఒక రేంజ్ లో గగ్గోలు పెడుతుంటారు. కానీ ఇప్పుడు రియల్ గా, లైవ్ లో ఒక నటి జ్ఞాపకశక్తిని కోల్పోవడంతో అభిమానుల కండిషన్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు బుల్లితెరపై అత్యంత సాహసోపేతమైన రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ' సీజన్ 15 లో అందరినీ ఉలిక్కిపడేలా చేసే ఒక దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ తో పాటు సౌత్ చిత్రసీమలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుని, తెలుగులో అల్లరి నరేష్ సరసన '3G లవ్', అలాగే 'లేడీస్ అండ్ జెంటిల్మెన్' చిత్రాలలో నటించిన ప్రముఖ నటి జాస్మిన్ భాసిన్ ఈ షోలో ఒక భయంకరమైన ప్రమాదానికి గురయ్యారు. షోలో భాగమైన కఠినమైన యాక్షన్ స్టంట్ చేస్తుండగా ఆమె తాత్కాలికంగా తన జ్ఞాపకశక్తిని కోల్పోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వారాంతంలో జరిగిన ఎపిసోడ్లో భాగంగా నీరు, గాలితో కూడిన ఒక అత్యంత ప్రమాదకరమైన వాటర్ అండ్ ఎయిర్ స్టంట్‌ను జాస్మిన్ భాసిన్ నిర్వహించాల్సి వచ్చింది. స్టంట్ చేస్తుండగా ఊహించని విధంగా ఆమె బ్యాలెన్స్ తప్పి వేగంగా నీటిలో పడిపోయారు. నీటి తీవ్రతకు ఆమె తలకు స్వల్ప గాయం (Mild Concussion) కావడం వల్ల మైండ్ బ్లాంక్ అయిపోయింది. స్టంట్ పూర్తయిన వెంటనే నీటి నుంచి బయటకు వచ్చిన జాస్మిన్ తీవ్ర అయోమయానికి గురైంది. అక్కడ ఏం జరుగుతోంది, అసలు తను ఎందుకు అక్కడ ఉందో కూడా చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోవడంతో సెట్లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. షో హోస్ట్, ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టిని కలిసిన జాస్మిన్.. పదేపదే తనకు ఏం జరిగిందో గుర్తులేదని, తన మైండ్ ఖాళీగా అనిపిస్తోందని చెబుతుండటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జాస్మిన్ ముఖంలో కనిపించిన భయం, అయోమయాన్ని చూసి రోహిత్ శెట్టి ఆమెను సముదాయిస్తూ, ప్రశాంతంగా ఉండమని ధైర్యం చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన షో వైద్య బృందం ఆమెను అత్యవసరంగా పరీక్షించి, హెడ్ ఇంజ్యూరీ వల్ల తాత్కాలిక జ్ఞాపకశక్తి లోపం (Temporary Memory Loss) ఏర్పడిందని నిర్ధారించారు. అనంతరం ఆమె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, కనీసం 72 గంటల పాటు (3 రోజుల పాటు) పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ చేదు అనుభవంపై తర్వాత స్పందించిన జాస్మిన్ భాసిన్ తన ఆందోళనను పంచుకున్నారు. "ఆ స్టంట్ నా జీవితంలో అత్యంత విచిత్రమైన, భయంకరమైన అనుభవం. స్టంట్ ముగిసిన వెంటనే ఏం జరిగిందో నాకు ఇప్పటికీ అస్సలు గుర్తులేదు. నా మెదడులో ఆ క్షణాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వైద్యులు, రోహిత్ సర్, షో మేనేజ్మెంట్ నా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు" అని వెల్లడించారు. ఇది మానసికంగా ఎంతో సవాలుగా అనిపించినప్పటికీ, తనలోని ఫైటర్ స్పిరిట్‌ను మళ్ళీ నిద్రలేపిందని ఆమె పేర్కొన్నారు. Also Read: నటనకే నటన నేర్పాడా! విశ్వనాధ్ అండ్ సన్స్ కలెక్షన్స్ మూడు రోజుల కలెక్షన్స్ ఇవే అయితే 'ఖత్రోన్ కే ఖిలాడీ 15' షో వరుసగా మూడో వారం కూడా వివాదాల్లో నిలవడం గమనార్హం. మొదటి వారంలో పెల్లెట్ గన్ టాస్క్, రెండో వారంలో పోటీదారుల చేతులపై వేడి మైనం పోసే స్టంట్లు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఇప్పుడు ఏకంగా నటి జ్ఞాపకశక్తి కోల్పోయేలా ప్రమాదం జరగడంతో షోలో కంటెస్టెంట్ల భద్రతా ఏర్పాట్లపై ప్రేక్షకులు మరియు అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Jasmin Bhasin, Khatron Ke Khiladi 15, Bollywood
Aug 17, 2026 10:29AM'ఆపరేషన్ సఫేద్ సాగర్' వెబ్ సిరీస్‌పై వివాదం.. బ్యాన్ చేయాలంటూ నెటిజన్ల డిమాండ్!
వర్సటైల్ నటుడు సిద్ధార్థ్, బాలీవుడ్ నటులు జిమ్మీ షేర్ గిల్, దియా మీర్జా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్'. ప్రముఖ దర్శకుడు ఓని సేన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా సిరీస్ ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చింది. అయితే విడుదలైన కొద్దిరోజులకే ఈ ప్రాజెక్ట్ ఒక అనూహ్యమైన వివాదంలో చిక్కుకుంది. 1999 కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం (IAF) ప్రదర్శించిన వీరోచిత పోరాట ఘట్టాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. కథ రీత్యా ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగుతున్నప్పటికీ, ఇందులో చూపించిన ఒక సన్నివేశంపై ఇప్పుడు సైనిక వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సిరీస్‌లో అమరవీరుడైన స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా పాత్రను సిద్ధార్థ్ పోషించారు. ఆయన భౌతికకాయాన్ని మోసుకెళ్లే సన్నివేశంలో పేటికపై కప్పిన భారత జాతీయ జెండా అమరిక నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ శౌర్య చక్ర గ్రహీత, ఆర్మీ మాజీ కల్నల్ వేంబు శంకర్ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. నేషనల్ ఫ్లాగ్ కోడ్ ప్రకారం కాషాయ రంగు తల వైపు ఉండాల్సి ఉండగా, ఆ సీన్లో తలకిందులుగా ఉంచారని ఆధారాలతో సహా ఎత్తిచూపారు. జాతీయ పతాక గౌరవానికి సంబంధించిన ఈ పొరపాటును డిజిటల్‌గా వెంటనే సరిదిద్దాలని, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సిరీస్ స్ట్రీమింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా సైనిక గౌరవాలను విస్మరించినందుకు మేకర్స్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేశారు. గతంలో 'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి సూపర్ హిట్ లవ్ స్టోరీలతో మెప్పించిన సిద్ధార్థ్, ఈ మధ్యకాలంలో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ఓటీటీ స్పేస్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నారు. ఇలాంటి దేశభక్తి నేపథ్యం ఉన్న పాత్రలో సిద్ధార్థ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నప్పటికీ, మేకర్స్ చేసిన సాంకేతిక పొరపాటు నెగెటివ్ టాక్‌కు కారణమైంది. ప్రస్తుతం ఆర్మీ మాజీ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జాతీయ పతాక నిబంధనలను ఉల్లంఘించడాన్ని తప్పుబడుతూ అనేకమంది నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. సైనిక వీరుల త్యాగాలను తెరపై ఆవిష్కరించేటప్పుడు మేకర్స్ మరింత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం మరియు 'ఆపరేషన్ సఫేద్ సాగర్' చిత్రబృందం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. త్వరలోనే ఈ సన్నివేశాన్ని రీ-ఎడిట్ చేసి వివాదానికి తెరదించుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.
Aug 12, 2026 8:42PMహాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్‌తో వస్తున్న అక్షయ్ కుమార్: 'సముక్' సినిమా షూటింగ్ కీలక అప్డేట్!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రయోగాలకు ఎప్పుడూ ముందుంటారు. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే ఆయన, ఈసారి భారతీయ సినీ చరిత్రలోనే అరుదుగా వచ్చే ఏలియన్ థ్రిల్లర్ జానర్లో ‘సముక్’ అనే విభిన్నమైన సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 23 నుంచి లండన్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమా చిత్రీకరణలో అత్యధిక భాగం అంటే దాదాపు 90 శాతం లండన్ లొకేషన్లలోనే జరపాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఎక్కడా విరామం ఇవ్వకుండా ఒకే నిరంతర షెడ్యూల్లో లండన్ చిత్రీకరణను పూర్తి చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. లండన్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మిగిలిన కొన్ని కీలక సన్నివేశాలను ముంబైలో తెరకెక్కించనున్నారు. విదేశీ లొకేషన్లు, అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అలాగే ప్రత్యేకం రూపకల్పన చేసిన ఏలియన్ డిజైన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రానికి కనిష్క్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి విపుల్ అమృత్లాల్ షా నిర్మిస్తున్నారు. గతంలో అక్షయ్ కుమార్, విపుల్ షా కాంబినేషన్లో వచ్చిన ‘ఆంఖే’, ‘వక్త్’, ‘నమస్తే లండన్’, ‘సింగ్ ఈజ్ కింగ్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాయి. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో సైన్స్ ఫిక్షన్ ఏలియన్ జానర్ సినిమాలు చాలా అరుదుగా రూపుదిద్దుకుంటాయి. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ చేస్తున్న ఈ కొత్త ప్రయోగంపై సినీ ప్రియుల్లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంతో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ప్రాజెక్ట్ అప్డేట్ రాగానే అక్షయ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక సరికొత్త హాలీవుడ్ స్థాయి సర్వైవల్ థ్రిల్లర్ అనుభవాన్ని ఇండియన్ స్క్రీన్‌పై చూడబోతున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి ‘సముక్’ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న అక్షయ్ కుమార్ కెరీర్లో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. Akshay Kumar, Samuk Movie, Vipul Amrutlal Shah, Kanishk Varma
Aug 12, 2026 6:42PM
'హైవాన్' టీజర్: ఫస్ట్ టైమ్ అలాంటి క్యారెక్టర్లో అక్షయ్ కుమార్.!
అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్న సినిమా "హైవాన్". సరికొత్త థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీతో ఫస్ట్ టైమ్ నెగిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. "హైవాన్" సినిమా సెప్టెంబర్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్ర టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. "హైవాన్" మూవీ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మూవీలోని ప్రధాన పాత్రధారులు సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ క్యారెక్టర్స్ ను టీజర్ లో పరిచయం చేశారు. సైఫ్ అలీఖాన్ ని దివ్యాంగుడి పాత్రలో చూపించడం ఆసక్తి రేపుతోంది. అక్షయ్ కుమార్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించారు. భవనం పై నుంచి నోట్ల కట్టలు కిందికి పడటం, ఒకరు గాయాలతో సహాయం కోసం వేచి చూస్తుండటం టీజర్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. డైరెక్టర్ ప్రియదర్శన్ తన మార్క్ థ్రిల్లర్ మూవీని హైవాన్ లో ప్రేక్షకులకు చూపించబోతున్నట్లు టీజర్ ప్రామిస్ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన "హైవాన్" ఫస్ట్ లక్ పోస్టర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు టీజర్ కూడా భారీ రెస్పాన్స్ తెచ్చుకునేలా కనిపిస్తోంది. 'హైవాన్' మూవీతో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో బొమన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియ పిల్గాంకర్ నటిస్తున్నారు. Haiwaan Teaser, Akshay Kumar, Saif Ali Khan, Priyadarshan, KVN Productions
Aug 12, 2026 5:53PMఇండియాలో నన్ను బ్యాన్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్.!
తన మధురమైన గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ పాకిస్థానీ గాయకుడు ఆతిఫ్ అస్లామ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంగీత వర్గాల్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్‌గా మారాయి. భారతదేశంలో తనపై విధించిన నిషేధంపై ఆయన బహిరంగంగా స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను భారతదేశంలో బ్యాన్ చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆతిఫ్ పేర్కొనడం విశేషం. ఈ నిషేధం వల్లే తాను జీవితంలో మరింత పరిణతి సాధించగలిగానని, వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను బాలీవుడ్లో సరిగ్గా ఆఫర్లు లేకపోవడం లేదా అక్కడ పనిచేయకపోవడాన్ని ఏమాత్రం మిస్ కావడం లేదని స్పష్టం చేశారు. ఒక కళాకారుడిగా తన మ్యూజిక్ సరిహద్దులతో సంబంధం లేకుండా ఎక్కడికైనా చేరుకుంటుందని ఆతిఫ్ వెల్లడించారు. భారతదేశంలో మళ్లీ పనిచేసే అవకాశం వస్తే వద్దననని, ప్రాజెక్టులు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ప్రశాంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు వివరించారు. ఒకప్పుడు బాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ సింగర్‌గా దూసుకుపోయిన ఆతిఫ్, భారతదేశంలో లెక్కలేనన్ని హిట్ చార్ట్‌బస్టర్ పాటలను అందించారు. అయితే దౌత్యపరమైన, రాజకీయ ఉద్రిక్తతల వల్ల పాకిస్థానీ కళాకారులపై భారత్‌లో నిషేధం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో గత కొన్నేళ్లుగా ఆయన ఇండియన్ ప్రాజెక్టులకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో స్టేజ్ షోలు, లైవ్ కన్సర్ట్లతో బిజీగా గడుపుతున్నానని, శ్రోతల నుంచి వచ్చే ప్రేమ తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని చెప్పారు. వివాదాలకు దూరంగా ఉంటూ కేవలం తన మ్యూజిక్ కేరీర్‌పైనే దృష్టంతా కేంద్రీకరించినట్లు చెప్పుకొచ్చారు. ఆతిఫ్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విభిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సంగీత ప్రియులు ఆయన మాటలను సమర్థిస్తుంటే, మరికొందరు బాలీవుడ్‌ను మిస్ అవ్వట్లేదనడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఆతిఫ్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటే తప్ప ఇండో-పాక్ ఆర్టిస్టుల కాంబినేషన్లు తిరిగి పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేవు. భవిష్యత్తులో ఈ పరిస్థితి మారితే గానీ ఆతిఫ్ అస్లామ్ లాంటి గొంతు మళ్లీ ఇండియన్ స్క్రీన్‌పై వినిపించదు. Atif Aslam, Pakistani Singer Atif Aslam, Bollywood Ban, Atif Aslam Songs In Bollywood
Aug 12, 2026 5:13PM
నసీరుద్దీన్ షాపై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ సినీ హిస్టరీని చెప్పమంటే తెలుగు ప్రేక్షకులు సైతం గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తారు. ప్రభాస్ తో ఏక్ నిరంజన్ చేసిన కంగనా ఇప్పడు భారతీయ జనతా పార్టీ తరుపున ఎంపి గా సేవలందిస్తూ ఉంది. తాజాగా ఆమె లెజండ్రీ యాక్టర్ నసీరుద్దీన్ షా పై చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.జార్ఖండ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నటుడు, గాయకుడు పీయూష్ మిశ్రా స్వయంగా రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియానికి చేరుకుని విద్యార్థులకి తన సంఘీభావం తెలిపాడు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ 'నసీరుద్దీన్ షా గతంలో దేశంలో జరిగిన విద్యార్థుల నిరసనలపై బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు నోరు విప్పడం లేదు. నోట్లో ఎముక ముక్క ఉన్న కుక్క మొరగలేదు. సినీ ప్రముఖులు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే మౌనంగా ఉంటున్నారని చెప్పాడు. అయితే, ఇప్పుడు జార్ఖండ్‌లో విద్యార్థులపై లాఠీఛార్జ్ జరుగుతుంటే, 14వ జేపీఎస్సీ పరీక్ష వివాదంలో అభ్యర్థులు వీధుల్లోకి వస్తే నసీరుద్దీన్ షా మౌనంగా ఎందుకు ఉన్నారని పీయూష్ మిశ్రా సూటిగా ప్రశ్నించారు. Also Read: యష్ వైఫ్ రాధిక భావోద్వేగ పోస్ట్ పీయూష్ మిశ్రా వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, బిజెపి ఎంపీ కంగనా రనౌత్ 'తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ 'నిజానికి మనమంతా ఏదో ఒక రకంగా ఎవరికో ఒకరికి విశ్వాసపాత్రంగానే ఉంటాం. నేను తింటున్న ఈ దేశపు అన్నానికి కృతజ్ఞతగా విశ్వాసంగా ఉండటం, ఈ దేశం కోసం పోరాడటం నాకు గర్వకారణం. నసీరుద్దీన్ షా మాత్రం ఈ దేశంలో తింటూ పొరుగు దేశం కోసం పోరాడతారు. ఈ రోజుల్లో విశ్వాసపాత్రంగా ఉండటాన్ని కుక్క అని పిలిచినా అది గొప్ప ప్రశంస లాంటిదే. ఎందుకంటే సమాజంలో విశ్వాసం, అమాయకత్వం చాలా అరుదైపోయాయి. నసీరుద్దీన్ షా లాంటి 'నక్క' గా ఉండేదానికంటే, విశ్వాసమున్న కుక్కలా ఉండటమే నాకు ఎంతో ఇష్టం" అని రాసుకొచ్చింది. Kangana Ranaut, Naseeruddin Shah, Bollywood
Aug 12, 2026 4:00PM'ఎవరికీ ముద్దు ఇవ్వలేదు..' ఉదిత్ నారాయణ్ 'కిస్' వివాదంపై కుమార్ సాను షాకింగ్ కామెంట్స్.!
బాలీవుడ్ లెజెండరీ సింగర్స్ కుమార్ సాను, ఉదిత్ నారాయణ్ పేర్లు వింటే 90వ దశకపు మధురమైన పాటలు గుర్తుకొస్తాయి. ఎన్నో అద్భుతమైన హిట్స్‌తో ఆ తరాన్ని మైమరిపించిన ఈ ఇద్దరు గాయకులు ఇప్పటికీ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా కుమార్ సాను చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కుమార్ సాను తన కెరీర్, అభిమానుల ప్రేమాభిమానాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో 90ల కాలంలో మహిళా అభిమానుల ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చారు. "నా దగ్గరకు వచ్చి ఎవరూ ముద్దు పెట్టలేదు, నేను కూడా ఎవరికీ ముద్దులు ఇవ్వలేదు.. అటువంటి పనులకు నేను ఎప్పుడూ చాలా దూరంగా ఉంటాను" అంటూ కుమార్ సాను సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్లు, ఇది ఖచ్చితంగా ఆయన సహచర గాయకుడు ఉదిత్ నారాయణ్‌ను ఉద్దేశించి చేసిన పరోక్ష కౌంటర్ అని చర్చించుకుంటున్నారు. గతంలో ఉదిత్ నారాయణ్ ఒక లైవ్ కాన్సర్ట్‌లో పర్ఫార్మ్ చేస్తుండగా ఒక మహిళా అభిమాని సెల్ఫీ కోసం స్టేజ్ పైకి వచ్చింది. ఆ సమయంలో ఆమె ఉదిత్‌ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించగా, అనుకోకుండా ఇద్దరి పెదవులు తగిలాయి. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అభిమానుల హద్దులు, సెలబ్రిటీల వ్యక్తిగత స్పేస్ గురించి ఆ సమయంలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఆ వివాదాన్ని మనసులో ఉంచుకునే కుమార్ సాను ఇప్పుడు ఇలా సరదాగా వ్యాఖ్యానించారని తెలుస్తోంది. అయితే, ఒకప్పుడు తమ మధ్య వృత్తిపరమైన పోటీ ఉండేదని, ప్రస్తుతం తమ మధ్య మంచి స్నేహబంధం ఉందని కుమార్ సాను ఇదే ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో కుమార్ సాను కామెంట్స్ వైరల్ కావడంతో అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. "90స్ లెజెండరీ సింగర్స్ హ్యూమర్ సెన్స్ వేరే లెవెల్" అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు కుమార్ సాను వ్యాఖ్యలపై ఉదిత్ నారాయణ్ ఏ విధంగా స్పందిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా, దశాబ్దాలు గడిచినా ఈ ఇద్దరు ప్రముఖ గాయకుల పాటలతో పాటు వారి మధ్య ఉన్న ఈ సరదా సంభాషణలు కూడా సంగీతాభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసి ఒకే వేదికపై పర్ఫార్మ్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Aug 10, 2026 7:32PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




.webp)

.webp)
.webp)



