హిందీ చిత్రం `మద్రాస్ కేఫ్`తో నటిగా తొలి అడుగులు వేసినప్పటికీ.. తెలుగు, తమిళ భాషల్లోనే కథానాయికగా గుర్తింపు పొందింది ఉత్తరాది సోయగం రాశీ ఖన్నా. దక్షిణాదిన ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఏడాదికి రెండు లేదా అంతకుమించి సినిమాలతో సందడి చేస్తూ వస్తున్న రాశి.. 2018లో తెలుగు, తమిళ భాషల్లో కలుపుకుని ఏకంగా ఐదు చిత్రాలతో పలకరించింది. కట్ చేస్తే.. 2021లో ఆ రికార్డుని బద్దలు కొట్టే దిశగా సాగుతోంది మిస్ ఖన్నా.
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో ఎనిమిది సినిమాలున్నాయి. వీటిలో రెండు తెలుగు చిత్రాలు కాగా.. ఐదు తమిళ సినిమాలు. మరొకటి మలయాళ మూవీ. విశేషమేమిటంటే.. ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలోనే రిలీజ్ అయ్యే దిశగా నిర్మాణం జరుపుకుంటున్నాయి. తెలుగు చిత్రాలు `థాంక్ యూ`, `పక్కా కమర్షియల్` ఏడాది చివరలో విడుదల కానుండగా.. కోలీవుడ్ ప్రాజెక్ట్స్ `అరణ్ మణై 3`, `తుగ్లక్ దర్బార్`, `సర్దార్`, `మేధావి`, `సుల్తాన్ కా బచ్చా` కూడా ఈ క్యాలెండర్ ఇయర్ లోనే జనం ముందుకు రానున్నాయి. వీటిలో `తుగ్లక్ దర్బార్` త్వరలో ఓటీటీలో స్ట్రీమ్ కానుండగా.. `సుల్తాన్ కా బచ్చా`, `అరణ్ మణై 3` విడుదలకు సిద్ధమయ్యాయి. ఇక మాలీవుడ్ వెంచర్ `భ్రమమ్` (హిందీ చిత్రం `అంధాధున్` రీమేక్) కూడా ఇదే సంవత్సరం విడుదల కానుంది.
మరి.. 2021లో రాశి అమలు చేయనున్న ఈ `అష్ట చిత్ర ప్రణాళిక` ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.