స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ట్రాన్స్‌పరెన్సీ లేకపోవటానికి ప్రసిద్ధి చెందాయి. అవి చెప్పే నంబర్లను వెరిఫై చేయడం క్లిష్టమైన వ్యవహారం. ప్రధానమైన ప్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యే క్రేజీ సినిమాలు, షోలకు సంబంధించిన వ్యూయర్‌షిప్‌ను ఓర్మాక్స్ మీడియా అనే మీడియా కన్సల్టింగ్ సంస్థ, ట్రాక్ చేయడం ప్రారంభించింది. మే 3 - మే 9 వారంలో భారతీయ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై అత్యధికంగా వీక్షించిన షోలు, మూవీల జాబితా ఇక్కడ ఉంది. ఈ సంఖ్యలన్నీ భారతదేశంలోని వీక్షకులపై మాత్రమే ఆధారపడిన అంచనాలు. ఈ జాబితాలో సౌత్ ఇండియా నుండి విడుదలైన కంటెంట్ లేదు.
1) అవుట్ ఆఫ్ లవ్ సీజన్ 2 - డిస్నీప్లస్ హాట్‌స్టార్
వ్యూస్: 6.8 మిలియన్
బిబిసి వన్ సిరీస్ 'డాక్టర్ ఫోస్టర్' ఆధారంగా, కూనూర్ నేపథ్యంలో నడిచే ఈ వెబ్ షో.. అవిశ్వాసం, అభద్రత ప్రధానంగా ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో నడుస్తుంది. మొదటి సీజన్ కంటే ఈ రెండవ సీజన్ మరింతగా వీక్షకుల్ని అలరిస్తోంది. ఈ షోలో రసిక దుగల్, పురబ్ కోహ్లీ ప్రధాన పాత్రధారులు.
2) LOL: హసీ తో ఫసీ - అమెజాన్ ప్రైమ్ వీడియో
వ్యూస్: 3.4 మిలియన్
అమెజాన్ ప్రైమ్ వీడియోలోని కొత్త కామెడీ రియాలిటీ షో, 'LOL: హసీ తో ఫసీ' కంటెంట్ చాలా సింపుల్. స్టాండ్-అప్ కామిక్స్ చేసే కామెడీ యాక్టర్స్, కంటెంట్ క్రియేటర్స్.. పది మంది పోటీదారులు కలిసి ఒక ఇంట్లో 6 గంటలు ఇరుక్కుపోతారు. వారి టాస్ప్? ఎదుటివాళ్లను నవ్వించాలి కానీ తాము మాత్రం నవ్వకూడదు. అలా చివరి దాకా నిలబడిన వ్యక్తి రూ. 25 లక్షలు అందుకుంటాడు. ఈ షోకు జడ్జిలుగా నటులు అర్షద్ వార్సీ, బోమన్ ఇరానీ వ్యవహరిస్తున్నారు.
3) రామ్‌యుగ్ - ఎంఎక్స్ ప్లేయర్
వ్యూస్: 2.4 మిలియన్
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించిన ఈ షోతో డైరెక్టర్‌గా కునాల్ కోహ్లీ కెరీర్ పునరుజ్జీవనం పొందిందని చెప్పాలి. ఇది శ్రీరాముడు, ఆయన భార్య సీత, ఆయన సోదరుడు లక్ష్మణుడు, ఆయన శత్రువు పది తలల రావణుడి జీవితంలో జరిగిన సంఘటనల సమాహారం ఇందులోని ఇతివృత్తం.
4) హలో మినీ 3 - ఎంఎక్స్ ప్లేయర్
వ్యూస్: 0.7 మిలియన్
నోవోనీల్ చక్రవర్తి రాసిన పుస్తకాల ఆధారంగా రూపొందిన ఈ షో.. మనం రెగ్యులర్‌గా ఓటీటీలో చూసే కల్ట్ గ్రూపులు, హత్యలు, ఎఫైర్లతో ఉత్తేజభరితంగా నడుస్తుంది.
5) ద బిగ్ బుల్ - డిస్నీప్లస్ హాట్‌స్టార్
వ్యూస్: 0.6 మిలియన్
హర్షద్ మెహతా జీవితానికి నాటకీయత జోడించి తీసిక బయోపిక్ ఈ మూవీ. గత సంవత్సరం మనం చూసిన 'స్కామ్ 1992' వెబ్ షోకు ఇది మూవీ రూపం అని చెప్పవచ్చు. అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించాడు. 1990ల నాటి ఆర్థిక మార్కెట్ కుంభకోణం నేపథ్యంలో జరిగే యథార్థ ఘటనలను ఆసక్తికరమైన కథనంతో రూపొందించారు.