సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చేస్తున్నారు. 2022 సంక్రాంతి లక్ష్యంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం విడుదలయ్యేలోపే తన నెక్స్ట్ వెంచర్ ని పట్టాలెక్కించనున్నారు మహేశ్. `#SSMB 28`గా రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్నారు. మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందీ భారీ బడ్జెట్ మూవీ.
ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ డైరెక్టోరియల్ తరువాత మహేశ్ చేయబోయే చిత్రంపై రకరకాల కథనాలు వస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశారు. త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ తరువాత మహేశ్ తన దర్శకత్వంలోనే తదుపరి చిత్రం చేయబోతున్నారని - ఇప్పటికే కథ కూడా ఓకే అయిందని వెల్లడించారు అనిల్. సో.. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మహేశ్, అనిల్ కాంబినేషన్ మూవీ పట్టాలెక్కే అవకాశముందన్నమాట. `సరిలేరు నీకెవ్వరు` వంటి బ్లాక్ బస్టర్ తరువాత మహేశ్, అనిల్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశముంది.
కాగా, అనిల్ ప్రస్తుతం `ఎఫ్ 3` చేస్తున్నారు. విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ ఇప్పటివరకు 50 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది.