దర్శకధీరుడు యస్.యస్. రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులకు టెస్టుల్లో కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. "కొద్ది రోజుల క్రితం నా కుటుంబ సభ్యలుకు, నాకు కొద్దిపాటి జ్వరం వచ్చింది. తర్వాత దానంతట అదే తగ్గిపోయింది. అయినప్పటికీ మేం టెస్ట్ చేయించుకున్నాం. అందులో స్వల్పంగా కొవిడ్ పాజిటివ్ ఉన్నట్లు ఈ రోజు తేలింది. డాక్టర్ల సలహా మేరకు హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నాం." అని ఆయన ట్వీట్ చేశారు.
తామందరం బాగానే ఉన్నామనీ, ఎలాంటి కొవిడ్ లక్షణాలు తమలో లేవనీ ఆయన తెలిపారు. "అయినప్పటికీ అన్ని రకాల జాగ్రత్తలు, సూచనలు మేం పాటిస్తున్నాం. యాంటీబాడీస్ డెవలప్ కోసం ఎదురుచూస్తున్నాం.. అప్పుడు మేం మా ప్లాస్మాను దానం చెయ్యగలం" అని వెల్లడించారు రాజమౌళి. అయితే తమ కుటుంబసభ్యులకు అని రాండమ్‌గా చెప్పారే కానీ, ఎవరెవరికి పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని ఆయన పేర్కొనలేదు. మొత్తానికి ఆయన భార్య రమ, కుమారుడు కార్తికేయ, కుమార్తె మయూఖ, కోడలు పూజా ప్రసాద్‌కు కూడా పాజిటివ్ వచ్చిందని తెలుస్తోంది.