సౌత్‌లోని పాపులర్ యాక్టర్లలో రాశీ ఖన్నా ఒకరు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ గ్లామరస్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. తనలోని నటికి సవాలు విసిరే క్యారెక్టర్ల కోసం ఆమె ఎదురుచూస్తోంది. నిజానికి తెలుగులో 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో ఎంట్రీ ఇవ్వడానికంటే ముందు జాన్ అబ్రహాం, నర్గీస్ ఫఖ్రి వంటి వాళ్లు నటించిన 'మద్రాస్ కేఫ్'లో నటించడం ద్వారా తెరంగేట్రం చేసింది. బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవకుశ, తొలిప్రేమ, వెంకీ మామ, ప్రతిరోజూ పండగే సినిమాలు ప్రేక్షకులకు ఆమెను దగ్గర చేశాయి. టాప్ స్టార్స్ సరసన నటించే అవకాశాలు రాకపోతున్నా హార్డ్‌వర్క్, టాలెంట్ ఆమెను సక్సెస్ఫుల్ హీరోయిన్గా నిలబెట్టాయి.
మరోవైపు సోషల్ మీడియాలో రాశీ చాలా యాక్టివ్. ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్ల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారంటేనే ఆమె ఫ్యాన్ బేస్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. "సీకర్. ట్రావెలర్. స్టార్ గేజర్. సన్‌సెట్ లవర్. సింగర్. యాక్టర్" అంటూ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో పెట్టుకుందామె. జోరు, విలన్, జవాన్ సినిమాల్లో ఆమె పాటలు పాడటం మనకు తెలుసు. లాక్డౌన్ పీరియడ్‌లో తనకు సంబంధించిన పలు ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలిగిస్తూ వస్తోంది. వాటిలో ఫ్యాన్స్ బాగా లైక్ చేసింది మాత్రం ఆమె చిన్ననాటి ఫొటోలనే. పసిపాపగా బోసినవ్వులు చిందిస్తోన్న రాశీ నిజంగా ఎంత క్యూట్‌గా ఉందో! భావి కాలంలో సినీ తారగా అందరినీ అలరిస్తానని అప్పుడే చెబుతున్నట్లు ఉంది ఆ ఫొటోల్లో!!