సాధారణంగా పులి కనిపిస్తే ఎవరైనా భయపడతారు. పులి పిల్ల కనిపించినా కాస్త కంగారుపడతారు. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి, ప్రముఖ ఎంట్రపెన్యూర్ ఉపాసన మాత్రం పిలిపిల్లను చక్కగా ఒళ్ళో కూర్చొబెట్టుకుని పాలు పట్టించారు. అది కూడా పాలు తాగుతోంది తప్ప ప్రమాదకరమైన విన్యాశాలు ఏమీ చేయలేదు. లెటెస్టుగా ఇంటర్నెషనల్ టైగర్స్‌డే సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉపాసన ఈ ఫొటో పోస్ట్ చేశారు.
పులిపిల్లకు పాలు తాగించడం చాలా ఎగ్జయిటెడ్‌గా అనిపించిందని ఉపాసన పేర్కొన్నారు. అయితే, మళ్ళీ అలా చేయనని ఆమె తెలిపారు. అడవిలో కంటే బందిఖానాలలో ఎక్కువ పులులు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయనీ, జూలో బంధించడం లేదా పెంపుడు జంతువులుగా హెల్దీ వైల్డ్ యానిమల్స్‌ను పెంచుకోవడాన్ని తాను నమ్మనని ఆమె అన్నారు.
ఇటీవల హైదరాబాద్ జూలో ఒక ఏనుగును ఉపాసన దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఏడాదికి ఆ ఏనుగు పోషణకు అయ్యే ఖర్చును తాను భరించడానికి ముందుకొచ్చారు. కరోనా నేపథ్యంలో జూ సందర్శకులు తగ్గడంతో టికెట్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోవడంతో జూలో జంతువుల పోషణ భారమవుతోంది. వాళ్ళకు సహాయం చేయడానికి దత్తత తీసుకున్నానని ఉపాసన తెలిపారు.