నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో విశ్వక్ సేన్ హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందిన 'హిట్: ది ఫస్ట్ కేసు'(2020) మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ వస్తోంది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ యూనివర్స్ నుంచి ఇంకా చాలా సినిమాలు వస్తాయని ఇప్పటికే డైరెక్టర్ శైలేశ్ ప్రకటించాడు. అడివి శేష్ సైతం 'హిట్-2' చివరిలో 'హిట్-3' హీరో ఎవరనేది రివీల్ అవుతుందని చెప్పాడు. అయితే 'హిట్-3'లో ముగ్గురు హీరోలు నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
'హిట్-1'లో నటించిన విశ్వక్ సేన్ 'హిట్-2'లో నటించకపోవడంపై ఇటీవల డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. ఈ హిట్ వరల్డ్ లో విశ్వక్ సేన్ పాత్ర కొనసాగుతుందని, ఆయన ముందు ముందు రాబోయే భాగాల్లో కనిపిస్తాడని చెప్పాడు. దీంతో విశ్వక్ 'హిట్-3'లో కనిపిస్తాడని భావించారంతా. కానీ 'హిట్-3'లో అడివి శేష్ కొనసాగడంతో పాటు కొత్తగా నాని, విజయ్ సేతుపతి కూడా ఎంట్రీ ఇస్తారని న్యూస్ వినిపిస్తోంది. నాని, సేతుపతి, శేష్ ఎంత మంచి నటులో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ముగ్గురు కలిసి నటిస్తే హిట్ యూనివర్స్ రేంజ్ మరోస్థాయికి వెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.