విశ్వక్ సేన్ హీరోగా యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఓ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయింది. అయితే విశ్వక్ సేన్ తో తలెత్తిన వివాదాల కారణంగా ఈ చిత్రాన్ని మరో హీరోతో చేయాలని అర్జున్ నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి విశ్వక్ సేన్ ప్లేస్ లోకి శర్వానంద్ వచ్చినట్టు తెలుస్తోంది.
కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ క్లాప్ తో అర్జున్-విశ్వక్ సేన్ కాంబినేషన్ లో మూవీ ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా తన కుమార్తె ఐశ్వర్య ను హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం చేయాలనుకున్నాడు అర్జున్. కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. విశ్వక్ సేన్ అన్ ప్రొఫెషనల్ యాక్టర్ అని, అతని వల్ల రెండు సార్లు షూటింగ్ క్యాన్సిల్ అయిందని, ఫోన్ చేసినా సరిగా స్పందించడని అర్జున్ ఆరోపించాడు. విశ్వక్ సేన్ మాత్రం తన మాటకు విలువ ఇచ్చేవారు కాదని, స్క్రిప్ట్ లో తాను చెప్పిన చిన్న చిన్న మార్పుల కూడా చేసేవారు కాదని చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా అర్జున్ మాత్రం విశ్వక్ తో సినిమా చేసేది లేదని, మరో హీరోతో చేస్తానని బలంగా చెప్పాడు. చెప్పినట్టుగానే తాజాగా శర్వానంద్ ని సంప్రదించినట్టు తెలుస్తోంది. శర్వానంద్ సైతం ఈ ప్రాజెక్ట్ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.