తెలుగు తెరకు మరో బాలీవుడ్ బ్యూటీ పరిచయం కాబోతుంది. 2017లో మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్న మానుషి చిల్లర్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో మరో రెండు హిందీ చిత్రాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడామె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
మెగా హీరో వరుణ్ తేజ్ తన 13వ సినిమాని శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ మూవీని సోనీ పిక్చర్స్, రెనసాన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మానుషి చిల్లర్ ని ఎంపిక చేసినట్టు న్యూస్ వినిపిస్తోంది. పాన్ ఇండియా రీచ్ ఉన్న సబ్జెక్టుతో రూపొందుతోన్న సినిమా కావడంతో మానుషి ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
వరుణ్ తేజ్ ప్రస్తుతం తన 12 వ సినిమాని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్నాడు. 'VT 13' త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.