సమ్మర్ సినిమా పండుగ.. ఈ వారం థియేటర్, ఓటీటీ రిలీజులు!
on Apr 3, 2024
సమ్మర్ సీజన్ మొదలైంది. గత శుక్రవారం విడుదలైన 'టిల్లు స్క్వేర్' థియేటర్లలో నవ్వులు పూయిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ శుక్రవారం(ఏప్రిల్ 5) 'ఫ్యామిలీ స్టార్' మూవీ థియేటర్లలోకి అడుగు పెట్టనుంది. అలాగే 'భరతనాట్యం', 'బహుముఖం' వంటి సినిమాలు కూడా విడుదల కానున్నాయి. మలయాళ ఇండస్ట్రీ హిట్ 'మంజుమ్మల్ బాయ్స్' తెలుగు వెర్షన్ ఏప్రిల్ 6న విడుదల కానుంది.
ఇక ఓటీటీలో కూడా ఈవారం సినిమాల సందడి గట్టిగానే ఉండనుంది. గత నెలలో థియేటర్లలో విడుదలైన 'భీమా', 'తంత్ర', 'లంబసింగి' వంటి సినిమాలు ఈ వారం ఓటీటీలో అలరించనున్నాయి.
డిస్నీ+హాట్‌స్టార్:
లంబసింగి మూవీ - ఏప్రిల్ 2
భీమా మూవీ - ఏప్రిల్ 5
హనుమాన్ మూవీ(తమిళ, కన్నడ, మలయాళం) - ఏప్రిల్ 5
ఆహా:
తంత్ర - ఏప్రిల్ 5
జీ5:
ఫారీ(హిందీ) - ఏప్రిల్ 5
Also Read