వోడ్కా వర్మతో సురేఖ కూతురు.. సుప్రీతను కూడా లైమ్‌లైట్‌లోకి తెచ్చేస్తాడా?
on Apr 3, 2024
రకరకాల పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయినవారు, స్టార్స్ వెలుగొందుతున్న వారు ఉన్నారు. వారిలో నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత కూడా ఉంది. సోషల్ మీడియాలో సురేఖావాణి, సుప్రీత యాక్టివ్‌గా ఉంటారు. సుప్రీతకు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. మంచి ఫ్రెండ్స్‌గా మెలిగే ఈ తల్లీకూతుళ్ళు ఎప్పుడూ నైట్ పార్టీల్లో బిజీగా ఉంటారు. ఆమధ్య కూతురికి స్వయంగా మందు తాగిస్తున్న సురేఖ ఫోటో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇప్పుడు సుప్రీత హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్, సుప్రీత జంటగా నటించే ఓ సినిమా ప్రారంభమైంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉండగా.. తాజాగా సుప్రీత మరోసారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రామ్‌గోపాల్‌వర్మతో వున్న ఆమె ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. వోడ్కా తాగుతున్న వర్మ పక్కన సుప్రీత్ కూర్చొని నవ్వులు చిందిస్తున్న సుప్రీత ఫోటో హల్‌చల్ చేస్తోంది. ఎంతో మంది హీరోయిన్లను లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చి వారికొక ఇమేజ్‌ని క్రియేట్ చేసిన వర్మ.. సుప్రీతకు కూడా లైఫ్ ఇస్తాడేమో.. అందులో భాగంగానే వర్మతో కలిసి ఇలా ఫోజ్ ఇచ్చిందేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అయితే ఇంతకుముందు రామ్‌గోపాల్‌వర్మకు ఇంతకుముందు బాగా క్రేజ్ ఉండేదని, అప్పట్లో అతను ఏ సినిమా చేసినా అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేందని, అతనికి ఇప్పుడంత సీన్ లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా ఎప్పుడూ వివాదాలతోనే దోస్తీ చేస్తూ తన కామెంట్స్‌తో, ప్రవర్తనతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వర్మతో సుప్రీత కలిసి ఉన్న ఫోటో మాత్రం చక్కర్లు కొడుతూ ఆమెను మరింత పాపులర్ చేస్తోంది.
Also Read