ఎన్టీఆర్, విశ్వక్‌సేన్, సిద్ధు.. మల్టీస్టారర్ ప్లానింగ్‌లో వున్నారా?
on Apr 3, 2024
‘ఎప్పటికీ లవ్‌యూ అన్నా.. దేవర ఆల్బమ్ ఉందమ్మా.. నెక్స్‌ట్ లెవల్.. ఇక ఈ ఆల్బమ్ అందర్నీ చంపేస్తుంది’ అని విశ్వక్‌సేన్ క్యాప్షన్ పెట్టి ఎన్టీఆర్‌ను హగ్ చేసుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఇక సిద్ధు జొన్నలగడ్డ భుజాలపై ఎన్టీఆర్ ఆప్యాయంగా చేతులు వేసి నవ్వుతున్న ఫోటోను పోస్ట్ చేసిన సిద్ధు ‘బిగ్ సర్‌ప్రైజ్ కమింగ్ సూన్’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ ఇద్దరు హీరోలు పెట్టిన క్యాప్షన్లు, ఫోటోలు నెటిజన్లకు షాక్ ఇస్తున్నాయి. ముగ్గురూ ఒకేచోట ఎందుకున్నారు, అసలు ఏం జరుగుతోంది? ఆ రాబోయే బిగ్ సర్‌ప్రైజ్ ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోసం వెతుకుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రెండు భాగాలుగా ‘దేవర’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమాను అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ చెయ్యబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘దేవర’ చిత్రాన్ని త్వరగా కంప్లీట్ చేసే పనిలో ఉంది యూనిట్. ఇదిలా ఉంటే.. సడన్‌గా ఎన్టీఆర్‌ని విశ్వక్‌సేన్, సిద్ధు కలవడం చర్చనీయాంశంగా మారింది. వాళ్ళు పెట్టిన క్యాప్షన్స్‌పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిద్ధు బిగ్ సర్‌ప్రైజ్ అంటున్నాడంటే ‘దేవర’లో సిద్ధు కూడా నటించాడేమో అనుకుంటున్నారు. విషయం ఏమిటంటే.. గత రాత్రి ఎన్టీఆర్‌ను ఆయన నివాసానికి వెళ్లి విశ్వక్‌సేన్, సిద్ధు జొన్నలగడ్డ, సూర్యదేవర నాగవంశీ కలిసినట్టు తెలుస్తోంది. వీరందరికీ ఎన్టీఆర్ పార్టీ ఇచ్చాడట. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారీ యంగ్ హీరోలు.
‘దేవర’ చిత్రంలో విశ్వక్‌సేన్ నటించాల్సి ఉన్నప్పటికీ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడనే వార్తలు గతంలో వచ్చాయి. ‘నాకు బాగా ఇష్టమైన ఓ హీరో సినిమాలో అవకాశాన్ని నేనే మిస్ చేసుకున్నాను. అయితే నాకోసం రాసిన పాత్ర అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. ఆ హీరోతో చెయ్యాలంలే ఇంకా పవర్‌ఫుల్‌గా ఉండాలి క్యారెక్టర్. అందుకే ఆ సినిమా చెయ్యలేదు’ అంటూ గతంలోనే చెప్పాడు విశ్వక్. అది ‘దేవర’ గురించేనని చాలా మంది కామెంట్ చేశారు. మరోపక్క ఎన్టీఆర్, విశ్వక్‌సేన్, సిద్ధు కలిసి ఏదైనా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారా? అందుకే ఈ మీటింగా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ముగ్గురు హీరోల మధ్య సఖ్యత, సాన్నిహిత్యం బాగానే ఉన్నట్టుగా ఉంది. కాబట్టి ముగ్గురూ కలిసి సినిమా చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Also Read