'పుష్ప' ఐటమ్ సాంగ్ కి సమంత షాకింగ్ రెమ్యునరేషన్!
on Nov 16, 2021
'ఏ మాయ చేశావే(2010)' సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై తన జర్నీని స్టార్ట్ చేసిన సమంత.. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 20 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడూ స్పెషల్ సాంగ్ చేయని సమంత.. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప' కోసం మొదటిసారి స్పెషల్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పింది. ఈ విషయాన్ని తాజాగా పుష్ప మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సాంగ్ కోసం సమంత తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్స్ సినిమాకి కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటారు. అయితే సమంత కేవలం ఒక స్పెషల్ సాంగ్ కోసమే దాదాపు రెండు కోట్ల రెమ్యునరేషన్ అందుకోనుందని న్యూస్ వినిపిస్తోంది. సమంతకి కేవలం సౌత్ లోనే కాకుండా.. 'ది ఫ్యామిలీ మ్యాన్-2' వెబ్ సిరీస్ తో నార్త్ లోనూ మంచి క్రేజ్ వచ్చింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'పుష్ప'కి సమంత క్రేజ్ ఖచ్చితంగా ప్లస్ అవుతుందని మేకర్స్ భావించారట. అందుకే భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ.. సమంత చేత ఫస్ట్ స్పెషల్ సాంగ్ ని తమ మూవీలో చేయిస్తున్నారని అంటున్నారు. మరి 'పుష్ప'కి సమంత గ్లామర్ ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.
కాగా పుష్పలో బన్నీకి జోడీగా రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కాకున్న పుష్ప మూవీ మొదటి భాగం 'పుష్ప ది రైజ్' డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.