చైతన్య వెబ్ సిరీస్ లో తమిళ్ బ్యూటీ!
on Nov 19, 2021
టాలీవుడ్ లో పలువురు స్టార్స్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో షోలు, వెబ్ సిరీస్ లతో అలరిస్తున్నారు. ఇప్పుడిదే బాటలో అక్కినేని హీరో నాగచైతన్య పయనిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ తో ఓ తమిళ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుందని తెలుస్తోంది.
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతన్య 'థాంక్యూ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే.. విక్రమ్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ కూడా చేయడానికి చైతన్య సిద్ధమయ్యాడు. చైతన్య నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. హర్రర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సిరీస్లో చైతన్య నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ లో హీరోయిన్ పాత్ర కోసం తమిళ నటి ప్రియా భవానీ శంకర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.
కాగా చైతన్య 'థాంక్యూ' సినిమాతో పాటు నాగార్జున 'బంగార్రాజు'లో కూడా నటిస్తున్నాడు. ఇందులో చైతన్య సరసన కృతిశెట్టి సందడి చేయనుంది.
Also Read