తేజ సజ్జ 'మిరాయ్'లో ప్రభాస్..!
on Oct 27, 2024
'హనుమాన్' తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జ.. ప్రస్తుతం 'మిరాయ్' సినిమాలో నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక బిగ్ సర్ ప్రైజ్ ఉన్నట్లు తెలుస్తోంది. అదేంటంటే ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో మెరవనున్నాడట.
'మిరాయ్'లో మాస్ మహారాజా రవితేజ అతిథి పాత్ర పోషించే అవకాశం ఉందని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఏకంగా ప్రభాస్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో 'ది రాజా సాబ్' సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఆ అనుబంధంతోనే 'మిరాయ్'లో గెస్ట్ రోల్ చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం.
అసలే 'హనుమాన్' తర్వాత తేజ సజ్జ నటిస్తున్న మూవీ. దానికితోడు ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తే.. ఇక ఈ సినిమాపై పాన్ ఇండియా వైడ్ గా మంచి అంచనాలు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
