మహేష్, రాజమౌళి సినిమాకి ముహూర్తం ఫిక్స్!
on Oct 28, 2024
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో రూపొందనున్న మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే ఆరోజు రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ కి ఏర్పాట్లు జరుగున్నట్లు తెలుస్తోంది. (SSMB 29 Update)
మహేష్-రాజమౌళి కాంబో మూవీ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం మూవీ టీం లొకేషన్ల వేటలో పడింది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియా వేదికగా రాజమౌళి తనయుడు కార్తికేయ పంచుకోవడం విశేషం. అంతేకాదు షూటింగ్ కి కూడా ముహూర్తం ఖరారైనట్లు వినికిడి. సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం లేదా నాలుగో వారంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు.. రాజమౌళి, మహేష్ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సినిమా విశేషాలను పంచుకునే అవకాశముంది. (SSRMB Update)