పవన్.. ప్రాణస్నేహితునికి దూరం అయ్యాడా?
on Oct 27, 2017
.jpg)
కేవలం పవన్ కల్యాణ్ స్నేహితునిగానే ఎక్కువ పేరు సంపాదించుకున్న వ్యక్తి శరత్ మరార్. కేవలం పవన్ తో మాత్రమే సినిమాలు తీసే నిర్మాత అని శరత్ మరార్ కి పేరు. ఎప్పుడూ పవర్ స్టార్ కి వెన్నుదన్నుగా, నీడగా, తోడుగా ఉంటాడాయన. కానీ.. గత కొన్ని రోజులుగా పవన్, శరత్ ఇద్దరూ కలిసి కనిపించడం లేదు. ఈ పరిణామంపై ఫిలింనగర్ లో పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయ్.
పవర్ స్టార్ తో శరత్ మరార్ నిర్మించిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు ఘోర పరాజయాలను చవిచూశాయ్. బయ్యర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించాయ్. అందుకే... ఈ మిత్రుల మధ్య విభేదాలకు ఈ సినిమాల వల్ల కలిగిన నష్టాలే అని టాక్. ఈ రెండు సినిమాల విషయంలో బయ్యర్లు చాలా తీవ్రంగా స్పందించారట. నష్టాన్ని పూడ్చాల్సిందిగా నిర్మాత అయిన శరత్ మరార్ పై వత్తిడి తెచ్చారట. కానీ.. ఈ పరిణామంపై పవన్ మాత్రం అంటీముట్టనట్టు ప్రవర్తించాడట. దాంతో శరత్ మరార్ కి పవన్ పై కోపం వచ్చి.. పలకడం మానేశాడని ఫిలింనగర్ లో చెప్పుకుంటున్నాడు.
ఇటీవల జరిగిన జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సం రోజున కూడా శరత్ మరార్ కనిపించలేదు. పవన్ కు దగ్గర వారైన అందరూ ఆ వేడుకకు హాజరవ్వడం విశేషం. మరి ఇందులో నిజం ఎంతో పవన్, శరత్ లకే తెలియాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



