పవన్ డోర్ తట్టే ముందు త్రివిక్రమ్ ని ఒప్పించండి
on Oct 24, 2017
.jpg)
కొందరిని కలవాలంటే కొన్ని పద్ధతులుంటాయి. అసలు వారిని కలిసే ముందు కొసరు వారి మన్ననలు పొందడం ఒక్కోసారి తప్పని పరిస్థితి. ఇక టాలీవుడ్ టాప్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ లాంటి వారిని కలవాలంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు, రాజకీయాలతో బిజీ గా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇంకో రెండు, మూడు సినిమాలు చేసి ఇండస్ట్రీ కి స్వస్తి పలకలనే ఉదేశ్యంతో ఉన్నారు. ఈ మధ్య కథల ఎన్నిక విషయంలో కాస్త బోల్తా పడ్డ పవన్, తదుపరి చిత్రాలకి తనకి అత్యంత ఆప్త మిత్రుడయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సహాయం కోరుతున్నాడు.
ప్రస్తుతం త్రివిక్రంతో అజ్ఞాతవాసి చేస్తున్న పవన్ కళ్యాణ్, కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. విజయ్ తమిళ్ సినిమా తెరి కి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వితీయార్ధంకి భారీ మార్పులు చేస్తున్నాడట సంతోష్. అయితే ఈ మధ్య పవన్ కి కథ చెబుదామని సంతోష్ వస్తే, తనకి వద్దు త్రివిక్రమ్ కి చెప్పమన్నాడట. ఒకవేళ, త్రివిక్రమ్ ఓకే చేస్తే తనకు కూడా ఓకే అని అన్నాడట.
ఒక్క సంతోష్ శ్రీనివాస్ కే కాదు, తనకు కథలు చెప్పేందుకు వస్తున్న ఇతర దర్శక నిర్మాతలకి కూడా పవన్ కళ్యాణ్ ఇదే చెబుతున్నాడట. సో, పవన్ డోర్ తట్టే ముందు త్రివిక్రమ్ ని మెప్పించాలన్నమాట!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



