ఈవిడగారి కంటికి.. మహానుభావుడే ఆనలేదు!
on Oct 31, 2017

హీరోయిన్లు సినిమాలను ఒప్పుకోడానికి ఓ ఈక్వెషన్లుంటాయ్. అలాగే.. సినిమాను రిజక్ట్ చేయడానికి కూడా కారణాలుంటాయ్. కారణాలు ఏవైనా... వాటిని బూతద్దంలో చూడ్డం మాత్రం మీడియా పని. రీసెంట్ కాజల్ ఓ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించింది. దీనిపై ఫిలింనగర్ లో రెండు రకాల వార్తలు వెలుగు చూశాయ్.
శతమానం భవతి, మహానుభావుడు విజయాలతో మంచి జోష్ మీదున్న శర్వానంద్... సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాడు. అందులో శర్వా ద్విపాత్రాభినయం చేయనుండటం విశేషం. వాటిల్లో ఒకటి కుర్రాడి పాత్ర అయితే.. రెండోది 45 ఏళ్ల మధ్యవయస్కుని పాత్ర. కథ రిత్యా మధ్య వయస్కుడే మెయిన్ హీరో.. అందుకే.. ఆ పాత్రకు జోడీని వెతికే పనిలో పడ్డారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే కాజల్ ని సంప్రదించారు. కానీ.. కథ విని కాజల్ ఈ పాత్రను సున్నతంగా తిరస్కరించిదట.
దీనిపై ఒకరు... ‘కాజల్ కి శర్వానంద్ కంటికి ఆనలేదు. చిన్న హీరోతో చేయడం దేనికని పక్కనపెట్టింది’ అని వార్త రాసేశాడు. ఇంకొకాయన.. ‘మధ్య వయస్కుని పక్క పాత్ర అనగానే.. తాను కూడా ఏజ్డ్ గా కనిపించాలి కదా. అందుకనే తిరస్కరించింది’ అని రాశాడు. మరి వీటిలో నిజం ఏదో మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



