పవర్ స్టార్ నిర్ణయం వెనుక అసలు విషయం ఇది
on Aug 2, 2017
పవన్ కళ్యాణ్... ఈ అక్టోబర్ నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో బిజీ కానున్నాడు.
అంటే... జరుగుతున్న త్రివిక్రమ్ సినిమా తర్వాత తను ఇక సినిమాలు చేయడా?
త్రివిక్రమ్ సినిమా తర్వాత పవన్ తన కెరీర్ కి పెట్టేది...పుల్ స్టాపా? లేక కామానా?
సంతోశ్ శ్రీనివాస్ తో చేస్తానన్న సినిమా సంగతేంటి?
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇవే ప్రశ్నలు. పవన్ నిర్ణయం... అటు అభిమానుల్లో.. ఇటు పరిశ్రమలో ఓ విధమైన కలవరానికే కారణమైందని చెప్పాలి. అంటే ఇక పవర్ స్టార్ తెరపై కనిపించరా? అంటూ ఆవేదనకు గురవుతున్న అభిమానులైతే... కోకొల్లలు. అసలు పవన్ నిర్ణయం వెనుక అసలు ఆంతర్యం ఏంటి? తెలుసుకోవాలనుందా? సరే వివరాల్లోకెళ్దాం.
పవర్ స్టార్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఓ వైపు ఆ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా! అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే... మన పవర్ స్టార్ ఏమో... పిడుగులాంటి స్టేట్మెంట్ ఇచ్చేసి అభిమానులను నైరాశ్యానికి గురిచేశారు. అక్టోబర్ నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషిస్తానని మీడియా సాక్షిగా చెప్పేశారు.
ఇక అప్పట్నుంచి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు. ‘త్రివిక్రమ్ సినిమానే పవర్ స్టార్ చివరి సినిమా’ అని ఎవరికి తోచిన పోస్టులు వారు పెట్టేసుకుంటున్నారు. అసలు ఇందులో నిజానిజాలు ఎంత? అనే విషయంపై అరా తీస్తే... అసలు విషయం బయట పడింది. అదేంటంటే?
పవర్ స్టార్ సినిమాలు చేస్తారు. సినిమాలు ఆపేయాలనే ఉద్దేశం పవన్ కల్యాణ్ కి లేదు. త్రివిక్రమ్-పవన్ సినిమా... ఓ వైపు బిజీ బిజీగా షెడ్యూల్స్ జరుపుకుంటుంటే... మరో వైపు సంతోశ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మించినున్న చిత్రం స్క్రిప్ట్ వర్క్ కూడా శరవేగంతో జరుగుతోంది. ఈ సినిమాకు ఇప్పటికే వపన్ 40 రోజులు కాల్ షీట్స్ ఇచ్చారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.
పూర్తిస్థాయి రాజకీయాల్లో బిజీగా ఉండే పవన్... రానున్న రోజుల్లో... ఓ 40 రోజులు మాత్రం ఈ చిత్రానికి కేటాయించనున్నారు. ఈ సినిమానే కాదు... ఇంకా పవన్ సినిమాలు చేస్తారని ఆంతరంగిక వర్గాల టాక్. మరి ఓ వైపు సినిమాలను, మరో వైపు రాజకీయాలను పవన్ ఏ విధంగా మేనేజ్ చేస్తాడో చూడాలి.