రాజమౌళి దర్శకత్వంలో శ్రీదేవి?
on Jul 26, 2017
ఎస్. ఎస్. రాజమౌళి వర్సెస్ శ్రీదేవి... కొన్ని రోజుల పాటు వీరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్దం మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది. . ‘బాహుబలి’లోని శివగామి పాత్రకు ముందు శ్రీదేవిని సంప్రదిస్తే... ఆమె గొంతెమ్మ కోర్కెలన్నీ కోరిందనీ, ఆమెను ఆ పాత్రకు తీసుకోకపోవడమే మంచిదయ్యిందనీ, ఒక వేళ ఆమె చేసుంటే సినిమా ఫ్లాప్ అయ్యేదని... డైరెక్ట్ గా మీడియా ముందే.. శ్రీదేవిపై రాజమౌళి విమర్శలు గుప్పించాడు. రాజమౌళీ చేప్పిన దాంట్టో నిజం లేదనీ, గొంతెమ్మ కోర్కలేవీ తాను కోరలేదనీ, కష్టపడి పైకొచ్చినదాన్ననీ... ఆ రోజుల్లో ఇన్ని సౌకర్యాలు లేకపోయినా సర్దుకుపోయి నటించాననీ, చెట్ల చాటుగా బట్టలు మార్చుకున్న రోజులున్నాయని... తాను పనిచేయని సినిమా గురించి ఆలోచించననీ.. తనపై ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నవారిపై కామెంట్లు చేయనని, అది వారి విజ్జతకే వదిలేస్తున్నానని శ్రీదేవి కౌంటర్ కూడా ఇచ్చేశారు.
మళ్లీ ఏమైందో ఏమో... ఈ విషయంపై రాజమౌళీ... శ్రీదేవికి క్షమాపణ కూడా చెప్పాడు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం దేనికి అనుకుంటున్నారా? దానికి కారణం ఉంది. మీడియా సాక్షిగా ఒకరిపై ఒకరు విమర్శించుకున్న శ్రీదేవి, రాజమౌళి.. త్వరలో కలిసి పనిచేయనున్నట్లు తెలిసింది. ‘బాహుబలి’ తర్వాత తాను చేయబోయే సినిమాలో శ్రీదేవి చేత నటింపజేయాలని రాజమౌళి భావించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై ఆమెను సంప్రదించినట్లు కూడా తెలిసింది. ఆ కథలో... కీలకమైన భార్యభర్తల పాత్రలు ఉన్నాయట. ఆ పాత్రలకు మోహన్ లాల్, శ్రీదేవి లచే చేయించాలని రాజమౌళి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో నిజానిజాలు త్వరలోనే బయట పడతాయ్.