పవన్ కన్నా...సాయిధరమ్ నయం..!
on Apr 21, 2016
సర్దార్ - గబ్బర్‌సింగ్ చాలామంది కొంపలు ముంచేసింది. ఈ సినిమా కొన్ని.. నష్టపోయిన జాబితా చాలా పెద్దదే! ఈ సినిమాపై గంపెడాశలు పెట్టుకొన్న పవన్ స్టార్ వీరాభిమానులు ఇంకా బావురుమంటూనే ఉన్నారు. నష్టాలు లెక్కగడితే... సగానికి సగం పోయినట్టు తేలిపోతుంది. అంటే.. పవన్ కల్యాణ్ సినిమా అంటే `నష్టం` తప్ప మరోటి కాదన్నమాట. అదే సాయిధరమ్ సినిమా సుప్రీమ్‌ని తీసుకోండి. ఈ సినిమా బడ్జెట్ 15 కోట్లు మించలేదు. అయితే రూ.25 కోట్లకు విడుదలకు ముందే అమ్మేశాడు దిల్‌రాజు. అంటే.. సినిమా... విడుదలకు ముందే రూ.10 కోట్లు లాభమన్నమాట. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలు హిట్ అవ్వడంతో సుప్రీమ్‌పై మంచి బజ్ ఏర్పడింది. దానికి తోడు పటాస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా ఇది. సినిమా ఎలాగున్నా. తొలిమూడు రోజుల్లో బంపర్ వసూళ్లు రావడం ఖాయం. అంటే... రూ.25 కోట్లు రాబట్టుకోవడం అంత కష్టమేం కాదన్నమాట. శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్మనే లేదు. ఆరూపంలోనూ కనీసం నాలుగు కోట్లు వెనకేసుకొనే అవకాశాలున్నాయి. సో... ఎటు చూసినా, పవన్ కంటే.. సాయి సినిమానే సో బెటరన్నమాట. అంతేలెండి.. ఒక పెద్ద సినిమాని నమ్ముకోవడం కంటే.. నాలుగు చిన్న సినిమాల్ని నమ్ముకోవడం ఎప్పటికైనా సేఫ్! ఈ విషయాన్ని బయ్యర్లూ గుర్తించాలి