'మూడొ'స్తే రెఢీ..!
on Mar 24, 2015
ఫస్ట్ ఇన్నింగ్స్ లో సీనియర్స్ తో చిందులేసి...సెకెండ్ ఇన్నింగ్స్ లో కుర్రాళ్లనే టార్గెట్ చేసుకున్న నయన్....కళ్లు బైర్లు కమ్మే స్టేట్ మెంట్ ఇచ్చింది. శింభుకి కట్ చెప్పి ప్రభుకి పేకప్ చెప్పిన నయన్... కెరీర్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాలేదు. యంగ్ హీరోలను ఎంపిక చేసుకుని కూల్ గా కెరీర్ బండి లాగించేస్తోంది. ప్రస్తుతం అమ్మడివి అరడజను సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వయసు మూడుపదులు మీద పడడంతో ఇక మూటగట్టుకోపోతే కష్టమే అని డిసైడైందట. అందుకే హీకో ఎవ్వరైనా పర్వాలేదు...మూడుకోట్లివ్వండి కాల్షీట్లు తీసుకోండి అని స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇక్కడ అంతుపట్టని విషయమేంటంటే....మొన్నటి వరకూ ఆఫర్లిస్తాం అని వెళ్లిన వాళ్లతో డేట్స్ ఖాళీ లేవు అని చెప్పిందట. ఇప్పుడేమో మూడిస్తే రెఢీ అంటోంది. దీంతో అమ్మడి తీరు చూసి ముక్కునవేలేసుకుంటున్నారంతా. ఏదేమైనా ఇండస్ట్రీలో నయనతారను చూసి పాఠాలు నేర్చుకోవాల్సిందే అంటున్నారు. మరి ఇంతకీ తారకు మూడిచ్చి మరీ ముద్దుచేసేదెవరో చూద్దాం.