త్రిష నయా యాంగిల్
on Mar 25, 2015
.jpg)
దశాబ్దానికి పైగా వావ్ అనిపించుకుంటున్న చెన్నైచంద్రం త్రిష ఈసారి వామ్మో అనిపిస్తుందట. ఏం చేస్తందేంటి అంటారా....ఇంకేముందండీ....భయపెడతా అంటోంది.మొన్న గీతాంజలి, నిన్న చంద్రకళ, గతంలో మంత్ర ఇవన్నీ సక్సెస్ బాట పట్టినవే కావడంతో అదే రూట్లో వెళతానంటోంది త్రిష. పెళ్లైనా ముఖానికి రంగేసుకోవడం మాననని క్లారిటీ ఇవ్వడమే కాకుండా...సరికొత్త పాత్రలను ఎంపికచేసుకుంటోంది. ఫేడవుట్ అనే సమయంలో బాలయ్య 'లయన్' లో ఛాన్స్ దక్కించుకోవడంతో పాటూ...ఓ హర్రర్ మూవీకి సైన్ చేసినట్టు ట్వీట్ చేసింది. అయితే ఇప్పటి వరకూ ప్రయోగాల జోలికే పోని ఈ బక్కపలచని భామ ఇప్పడీ నిర్ణయం తీసుకుందేంటా అని డిస్కషన్స్ జోరందుకున్నాయి. ముద్దుముద్దు మాటలు, ఓ నాలుగు పాటలకు పరిమితమైన ఈ చిన్నది భయపెట్టగలదా అనే డౌట్లు లేకపోలేదు. మరోవైపు త్రిష ఫ్రెండ్ నయన్ కూడా మాయ గా వచ్చి భయపెడతానంటోంది. మరి దోస్తులిద్దరిలో ఎవరిది పై చేయో? ఈ సినిమా త్రిష కెరీర్ ని ఎలాంటి మలుపు తిప్పుతుందో వెయిట్ అండ్ సీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



