బొమ్మాళీ రివర్స్ గేర్
on Mar 24, 2015
'సూపర్' గా ఎంట్రీ ఇచ్చి 'బొమ్మాళి'గా బ్రేక్ తీసుకున్న అనుష్క ఇప్పుడు జీరోసైజ్ మంత్రం జపిస్తోందట. పోనీలే ఈ మధ్య బాగా బొద్దుగా తయారైంది. మిర్చిలో నదియాకు అక్కలా, లింగలో స్క్రీన్ కి సరిపోయేలా ఉంది....తగ్గితే మంచిదేగా అనుకున్నారంతా. కానీ మీరు పప్పులో కాలేశారని ఫక్కున నవ్విందట స్వీటీ. నేను అన్న సైజ్ జీరో ఫిజిక్ గురించి కాదు....అది సినిమా టైటిల్ అని క్లారిటీ ఇచ్చిందట. టైటిల్ కు తగ్గట్టు ఉండాలంటే తగ్గాలి కదా అనుకుంటే అప్పటికిగానీ అసలు విషయం తెలియలేదు. టైటిల్ కు రివర్స్ లో బారీగా కనిపించనుందట అరుంధతి. అందుకోసం ఓ ప్రత్యేక ట్రైనర్ ను పెట్టుకుందట. దర్శకేంద్రుడి కొడుకు ప్రకాశ్ రూపొందిస్తున్న సైజ్ జీరో కి అను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మందంగా దర్శనిమివ్వబోతోందట ఈ మంగుళూర్ హాట్ కేక్. ఇప్పటికే బాహుబలి, రుద్రమదేవి ఓ కొలిక్కి వచ్చేయడంతో సైజ్ జీరో అంటూ హొయలుపోతోందట. ఇక్కడి వరకూ బాగానే ఉందికానీ...బొద్దందాల ఫోటోలు మాత్రం బయటకు పొక్కకుండా యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట. మరి కాస్త లావెక్కితేనే తట్టుకోలేం అనుకున్న సినీ ప్రియులు అడివిలాంటి అందాలను ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో!