కృష్ణవంశీని ఇంత దారుణంగా ఎందుకు తిట్టాడు..?
on Jun 27, 2017
మొన్నా మధ్య రివ్యూ రైటర్లపై విరుచుకు పడ్డ కృష్ణ వంశీ మీద కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. క్రియేటివ్ డైరెక్టర్ గా పిలవబడే ఆ పెద్దాయనకి ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలియదని... తనకే అన్నీ తెలుసు అనే భావనలో ఉంటాడని... ఇండస్ట్రీ ఎవడి అబ్బా సొత్తు కాదని రాకేష్ మాస్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. తాను ఒక కూలి పని చేసే వ్యక్తి కొడుకునని... కొన్ని వందల పాటలకి కొరియోగ్రఫీ చేసానని... తనకి ఆకలి ఆవేదనలు తెలుసునని... కానీ కృష్ణ వంశీ కి పొగరు ఎక్కువని... తనతో పని చేయించుకొని డబ్బులు ఎగ్గొట్టాడని తన అక్కసు వెళ్లగక్కాడు. ఇంతకీ, అసలు విషయం చెప్ప లేదు కదూ, కృష్ణ వంశీ చక్రం సినిమాలో జగమంత కుటుంబం నాది పాటకి మొదటగా రాకేష్ మాస్టర్ ని తీసుకొని... 11 రోజులు షూట్ చేసిన తర్వాత తనని తీసేసి లిరిక్స్ మార్చి మళ్ళీ అదే పాట వేరే వాళ్ళకి అప్పగించి తద్వారా తనకు డబ్బులు ఎగ్గొట్టాడట.
అదీ కాకుండా, సెట్లో ఏదో చిన్న విషయానికే అరిచి గోల చేసాడట... అన్నం పెట్టి తినకుండా చేసే వ్యక్తి కృష్ణ వంశీ అని... అతనొక వెధవ అని... తానొక పెద్ద డైరెక్టర్ అయ్యుండొచ్చు కానీ తన దృష్టిలో మాత్రం ఒక బచ్చా డైరెక్టర్ అని ఏ మాత్రం వెనక ముందు చూసుకోకుండా రాకేష్ తీవ్రమైన విమర్శలు చేసాడు. కృష్ణ వంశీ కి సిగ్గు ఉంటె తనకి డబ్బు ఇవ్వకుండా తప్పించుకోడు అని... తనకి కృష్ణ వంశీ అన్నా వేరే ఇంకెవరో అన్నా భయం లేదని... కళామతల్లి అంటే అపారమైన గౌరవమని చెప్పాడు. ఎంత వివాదాలు ఉన్న ఇండస్ట్రీ లో మనసులో పెట్టుకొని బయటపడకుండా చూసుకుంటారు. కానీ, రాకేష్ మాస్టర్ కృష్ణ వంశీ లాంటి అగ్ర దర్శకుడి పై ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. లోగుట్టు పెరుమాళ్ కెరుక అన్నట్టు... ఇప్పుడు ఈ సమయంలో రాకేష్ మాస్టర్ కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా ఎందుకు ఇంత తీవ్ర విమర్శలు ఎందుకో చేసాడో ఆయనకే తెలుసు అంటున్నారు!