ఎన్టీఆర్ vs మహేశ్..సెకండ్ వార్..!
on Jun 27, 2017
టాలీవుడ్‌లో టాప్ స్టార్లుగా కొనసాగుతున్నారు మహేశ్, ఎన్టీఆర్. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒకరి సినిమాలకు మరోకరు విష్ చేసుకుంటూ వచ్చారు. అయితే మొదటిసారిగా వీరిద్దరూ బాక్సాఫీసు బరిలో నిలవబోతున్నారు. బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న జై లవకుశ సెప్టెంబర్ 21నాడు రిలీజ్ అవుతుండగా..ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో మహేశ్ నటిస్తోన్న స్పైడర్‌ను వారం గ్యాప్‌లో 27వ తేదిన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవకుశ పక్కా మాస్ ఎంటర్‌టైనర్..అభిమానులు జూనియర్ నుంచి కోరుకునే అన్ని రకాల ఎలిమెంట్స్‌ని పెట్టి మూవీని తీర్చిదిద్దుతున్నాడు బాబీ. అయితే స్పైడర్ కేవలం ఒక సెక్షన్‌ని మాత్రమే టార్గెట్ చేస్తున్న మూవీ. సో.. రెండింటిని పోల్చి చూస్తే జై లవకుశకే ఎక్కువ స్కోప్ ఉందని ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు. అయితే రెండు పెద్ద సినిమాలు వారం వ్యవధిలో వస్తే కలెక్షన్లపై ప్రభావంపై చూపే అవకాశం ఉందని కొందరు భయపడుతున్నారు. ఇంతకు ముందు 2010 దసరాకి వచ్చిన ఖలేజా ఫ్లాపవ్వగా..వారం గ్యాప్‌తో రిలీజైన బృందావనం హిట్‌గా నిలిచింది. మరి ఈ దసరాకి ఎవరి ఫ్యాన్స్ పండుగ చేసుకోబోతున్నారో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
